అమరావతి : పెద్ద పజిల్లా తయారైన వివేకా కేసు

Vijaya
విచారణ గడువు దగ్గరపడుతున్న కొద్దీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు పెద్ద పజిల్లాగ తయారవుతోంది. ఈనెల 30వ తేదీలోగా వివేకా హత్యకేసును ఛేదించాలని సీబీఐకి సుప్రింకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. నిజానికి నాలుగేళ్ళుగా ఒక కొలిక్కిరాని హత్యకేసు విచారణ 30 రోజుల్లో పూర్తయ్యే అవకాశంలేదు. మరీ విషయం తెలిసే సుప్రింకోర్టు గడువు ఎందుకు విధించిందో అర్దంకావటంలేదు. సరే ఈ విషయాన్ని దగ్గరకు పడుతున్నకొద్దీ హత్యకేసు రోజురోజుకు జటలిమవుతోంది.రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. హత్యలో కీలకపాత్ర కడప ఎంపీ అవినాష్ రెడ్డి+ఆయన తండ్రి భాస్కరరెడ్డిదే అని సీబీఐ గట్టిగా వాదిస్తోంది. వాదన గట్టిగా వినిపిస్తోంది కానీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రంలేవు. ఇదే సమయంలో వివేకా హత్యకు కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డికి మధ్య జరిగిన గొడవలే అని అవినాష్ రెడ్డి పదేపదే ఆరోపించినా సీబీఐ పట్టించుకోలేదు. ఇపుడు విచారణ గడువు ముగుస్తున్న నేపధ్యంలో హఠాత్తుగా వివేకా రెండోభార్య షమీమ్ సీబీఐని కలిసి స్టేట్మెంట్ ఇవ్వటం సంచలనంగా మారింది.ఆమె స్టేట్మెంట్ ఆధారంగానే సీబీఐ చివరకు వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డిని విచారించింది. ఇపుడు చేసిన విచారణే హత్య జరిగిన వెంటనే చేసుంటే ఈపాటికి కేసు ఓ కొలిక్కి వచ్చుండేది. నాలుగేళ్ళు షమీమ్, అల్లుడ్ని ఎందుకు విచారించలేదో సీబీఐయ్యే చెప్పాలి. షమీమ్ ఇచ్చిన స్టేట్మెంట్ కడప ఎంపీ వాదనకు మద్దతుగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆదివారం పులివెందులలోని వివేకా, అవినాష్ ఇళ్ళల్లో సీబీఐ ఎందుకు సోదాలు చేసిందో ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి రోజుకో మలుపుతిరుగుతన్న హత్యకేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటం, రోజుకొకరిని విచారణకు పిలుస్తుండటంతో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. దాంతో విచారణ రోజురోజుకు పెద్ద సమస్యగా మారిపోతోంది. సుప్రింకోర్టు చెప్పినట్లుగా మరో ఆరురోజుల్లో పూర్తిచేయటం అయ్యేట్లులేదు. అన్నీ కోణాల్లోను కేసును దర్యాప్తు చేసిన తర్వాత సీబిఐ ఏమి తేలుస్తుందో అనే ఆసక్తి జనాలందరిలోను పెరిగిపోతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: