అమరావతి : ఎంపీ ప్రశ్నలను ఎందుకు పట్టించుకోవటంలేదు ?

Vijaya


ఈ విషయంలోనే అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడైనా ఒక వివాదం రేగినపుడు మధ్యవర్తులుగా ఉండి తీర్పు చెప్పేవారు రెండువైపుల వాదనలూ వినటం సహజం. అలాకాకుండా ఒకరుచెప్పేది మాత్రమే విని రెండో వైపు చెప్పేదాన్ని అసలు పట్టించుకోకుండా తీర్పుచెబితే అది న్యాయబద్దం ఎలాగవుతుంది ? ఇపుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది. ఎంతసేపు వివేకా హత్యకు కారణం అవినాష్, తండ్రి భాస్కరరెడ్డే అనే సీబీఐ వాదిస్తోంది.



ఎంపీ తన వాదన ఎంత వినిపించినా సీబీఐ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఇంతకుముందు దర్యాప్తుచేసిన అధికారి రామ్ సింగ్ అయినా ఇప్పుడు కొత్త బృందమైనా ఎంపీ విషయంలో ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళతో లాభంలేదని ఎంపీ కోర్టులో పిటీషన్లు వేస్తే ఇక్కడా న్యాయం జరగటంలేదు. ఎంపీ లేతనెత్తిన అంశాలపైన ఎందుకు దర్యాప్తు చేయటంలేదని కోర్టు సీబీఐని అడగలేదు. కేసు విచారణ సందర్భంగా తెలంగాణా హైకోర్టులో  వివేకా హత్యకు ఎంపీ తరపు లాయర్ నాలుగు కారణాలను చెప్పారు.



అవేమిటంటే కుటుంబకలహాలు, వ్యాపార సంబంధాలు, వివాహేతర సంబంధాలు, పొలిటికల్ గెయిన్. ఈ పాయింట్లపైన దర్యాప్తు చేయమని ఎంపీ ఎంత మొత్తుకుంటున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు. సీబీఐ వైఖరి చూస్తుంటే ఎంపీతో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి హత్యకు సూత్రదారులని ముందే నిర్ణయించేసుకున్నట్లుంది. అందుకనే ఇక దర్యాప్తు అవసరంలేదని అనేసుకుని వీళ్ళ అరెస్టుకు రెడీ అయిపోయింది. భాస్కరరెడ్డిని అరెస్టుచేసిన సీబీఐ అవినాష్ అరెస్టుకు రెడీ అవుతోంది. 



సీబీఐ కోణంలో సమస్య ఒకటుంది. అదేమిటంటే హత్యకేసును ముగించేందుకు సుప్రింకోర్టు ఇచ్చిన గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది. అంటే మరో 12 రోజుల్లో దర్యాప్తు ముగించి కోర్టుకు ఫైల్ అందించకపోతే సీబీఐ డైరెక్టర్ కోర్టు బోనెక్కాల్సుంటుంది. అన్నీ కోణాల్లోను విచారించి హంతకులు ఎవరు ? కారణాలు ఏమిటని తేల్చాలంటే చాలాకాలం పడుతుంది. ఇంతకుముందు దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ఫైండింగ్స్ నే కొత్త టీమ్ కూడా ఫాలోయిపోయినట్లుంది. అందుకనే ఎంపీ అరెస్టుకు రెడీ అయిపోతోంది. కేసును ఏదోలా ముగించాలని ఆతృతపడుతోంది కాబట్టే ఎంపీ లేవనెత్తిన అంశాలను సీబీఐ పట్టించుకోవటంలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: