అమరావతి : ఎల్లోమీడియా రాతలన్నీ తప్పని రుజువైందా ?

Vijaya
ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎల్లోమీడియా రాసిందంతా అబద్ధాలే అని తేలిపోయింది. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ భాస్కరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని రక్షించేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడంటు నానా రచ్చ చేస్తోంది ఎల్లోమీడియా. ఇక్కడ రెండు రకాలుగా జరుగుతోంది. మొదటిదేమిటంటే ఎల్లోమీడియా రాతలు రాయటం దాన్నిపట్టుకుని చంద్రబాబునాయుడు అండ్ కో గోలచేయటం. లేదంటే చంద్రబాబు అండ్ కో మీడియా సమావేశం పెట్టి గోలచేస్తే దాన్నిపట్టుకుని ఎల్లోమీడియా రచ్చచేస్తుంది.తాజా డెవలప్మెంట్ల ప్రకారం తండ్రి, కొడుకులను జగన్ రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని రాసిందంతా అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే భాస్కర్ ను సీబీఐ అరెస్టుచేసింది కాబట్టే. ఇంతకాలం జగన్ పైన వీళ్ళు చల్లుతున్న బురద ఏమిటంటే అవినాష్, భాస్కర్ లకు సీబీఐ నోటీసులివ్వగానే జగన్ ఢిల్లీకి వెళ్ళిపోయి రక్షించమని మోడీని బతిమలాడుకుంటున్నాడని. అదే నిజమైతే భాస్కర్ ను సీబీఐ అరెస్టుచేసుండేదికాదు.ఇపుడు భాస్కర్ అరెస్టైన నేపధ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్ళి మోడీని బతిమలాడుకుంటున్నారని రాసిందంతా అబద్ధమని తేలిపోయింది. భాస్కర్ అయినా రేపు అవినాష్ ను అరెస్టు విషయంలో అయినా జగన్ వైఖరి ఒకేలాగుంటుందనటంలో సందేహంలేదు. జగన్ ముందున్న లక్ష్యాల్లో అవినాష్ వ్యవహారం చాలా చిన్నదనే అనుకోవాలి. వచ్చేఎన్నికల్లో 175 సీట్లనూ గెలుచుకోవలని పెట్టుకున్న టార్గెట్లో అవినాష్ వ్యవహారం చాలా చిన్నది.కడప ఎంపీగా అవినాష్ కాకపోతే ఇంకో నేతని నిలబెడతారంతే. జగన్ వల్ల అవినాష్ పాపులరయ్యాడే కానీ అవినాష్ వల్ల జగన్ కు జరిగిన ప్లస్సేమీ లేదు. కాకపోతే కీలకమైన సమయంలో అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన అవినాష్ పక్కన లేకపోవటం లోటనుకోవాలి అంతే. ఇదంతా ఎప్పుడు అవినాష్ ను సీబీఐ అరెస్టు చేసినప్పటి సంగతి. ఎందుకంటే జగన్ తన రాజకీయంలో అవినాష్ మీదో లేకపోతే మరోకళ్ళ మీద మాత్రమే ఆధారపడే వ్యక్తికాదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యామ్నాయాన్ని కచ్చితంగా ముందే ఏర్పాటుచేసుకునే ఉంటారనటంలో సందేహంలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: