అమరావతి : జగన్ పైన మైండ్ గేమ్ పెరిగిపోతోందా ?

Vijaya



వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టుతో జగన్మోహన్ రెడ్డిపైన మైండ్ గేమ్ మొదలైంది. ఎవరినో లాబీయింగ్ కు దింపారని, తొందరలోనే అరెస్టు ఖాయమనే భయం మొదలైందని టీడీపీ, జనసేన, ఎల్లోమీడియా ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి. భాస్కరరెడ్డి అరెస్టుతో తొందరలోనే ఎంపీ అరెస్టు కూడా తప్పదంటు జోస్యాలు మొదలుపెట్టేశారు. సునీత పోరాటానికి ఇపుడే కాస్త న్యాయం జరిగినట్లుగా టీడీపీ, జనసేన నేతలతో పాటు ఎల్లోమీడియా కూడా ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారం ఎంతదాకా వెళుతోందంటే అవినాష్ అరెస్టుతో ఆగదని తాడేపల్లిలోని చివరి వ్యక్తి అరెస్టు తప్పదని చెప్పేంతగా.



తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ అరెస్టు కూడా తప్పదని డైరెక్టుగా చెప్పకుండా తాడేపల్లిలోని చివరి వ్యక్తి అరెస్టు దాకా వెళుతుందని మాత్రమే చెబుతున్నారు. జగన్ను సీబీఐ ఎందుకు అరెస్టుచేస్తుందని అడిగితే మళ్ళీ సమాధానం చెప్పటంలేదు. వీళ్ళ కోరిక ఏమిటంటే  సీబీఐ జగన్ను కూడా తొందరగా అరెస్టు చేయాలని. వివేకా మర్డర్ కేసుకు జగన్ కు లింకుపెట్టేసి మాట్లాడేస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన అవినాష్, తండ్రి భాస్కర్ రెడ్డే మర్డర్ లో కీలక పాత్రదారులు కాబట్టి జగన్ కు కూడా సంబంధాలు ఉంటాయని ఎవరికి వాళ్ళుగా అనేసుకుంటున్నారు.



మళ్ళీ ఆ విషయాన్ని సూటిగా చెప్పేందుకు జంకుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాడేపల్లి చివరి వ్యక్తి అరెస్టు దాకా వెళుతుందని మాత్రం గోలచేస్తున్నారు. ఎల్లోమీడియాలో రాతలు కూడా దాదాపు ఇలాగే ఉంటోంది. ఎల్లోమీడియాకు జగన్ కు మధ్య మార్గదర్శి విషయంలో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.



తమపైనే చీటింగ్ కేసులు ఓపెన్ చేయించి సీఐడీతో విచారణ చేయిస్తారా అనే కసిని  భాస్కరరెడ్డి అరెస్టు వార్తలు, కథనాల కవరేజి రూపంలో చూపింది.  వివేకా కేసులో నుండి బయటపడేయమని లాబీమాస్టర్ విజయ్ కుమార్ ను జగన్ ఆశ్రయించారని ప్రచారం మొదలుపెట్టింది. న్యాయవ్యవస్ధను మ్యానేజ్ చేయటంలో విజయకుమార్ దిట్టగా పేరుందట. అయితే ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే నిజంగానే లాబీమాస్టర్ అంతదిట్టయితే ఇంతకాలం జగన్ ఎందుకు ఆయన్ను రంగంలోకి దింపలేదు. కేసును మొదట్లోనే అణగదొక్కేట్లుగా చేసుండేవారు కదా. లాబీయింగ్ ద్వారా న్యాయవ్యవస్ధను మ్యానేజ్ చేయచ్చని ఎల్లోమీడియా తేల్చేయటమే ఆశ్చర్యంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: