హైదరాబాద్ : చెడపకురా చెడేవు

Vijaya


తెలుగులో ఎంతో పాపులరైన ఈ సామెత బీజేపీ నేతలతో పాటు తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ కు సరిగ్గా సరిపోతుంది. పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో  ఏ1 నిందితుడిగా బండిపై పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణ తర్వాత బండిని కోర్టులో ప్రవేశపెడితే జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అంటే ఈనెల 19వ తేదీవరకు బండి+మరో ముగ్గురు ఖమ్మం జైలులోనే ఉండకతప్పదు.



ఇక్కడే అందరికీ పై సామెత గుర్తుకొస్తోంది. విషయం ఏమిటంటే  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితను ఎలాగైనా ఇరికించి జైలుకు పంపాలని కమలనాదులు పెద్ద ప్లానే వేశారు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటకొచ్చిందో అప్పటినుండి బండితో పాటు మరికొందరు నేతలు పదేపదే రెచ్చిపోయారు.  కవిత ఈరోజు అరెస్టవుతుంది.. కాదు కాదు రేపు అరెస్టు ఖాయమంటు నానా గోలచేశారు. స్కామ్ పై ఒకవైపు కోర్టులో  విచారణ  జరుగుతోంది, మరోవైపు ఈడీ దర్యాప్తు చేస్తోంది.



మధ్యలో బీజేపీ నేతలకు ఏమైందో ఏమో పదేపదే కవిత అరెస్టు ఖాయమంటు రెచ్చిపోయారు. అంటే వీళ్ళ గోల ఎలాగుందంటే దర్యాప్తుసంస్ధను కూడా ప్రభావితం చేసి కవితను అరెస్టు చేయించాలన్న ఆతృత కనబడింది. స్కామ్ లో ఇప్పటికి 11 మందిని అరెస్టుచేసిన ఈడీ కవిత పాత్రకు ఆధారాలుంటే  వదిలిపెడుతుందా ? కవిత పాత్రుందని నిరూపించాలని ఈడీ గట్టిగా ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది. ఇదే సమయంలో తన పాత్రుంటే తనను అరెస్టు చేసుకోమని కవిత చాలెంజ్ చేశారు. తనను అరెస్టుచేస్తే కోర్టులో పోరాటం చేస్తానని కూడా చెప్పారు.



ఇంతలోనే  కవిత అరెస్టు ఖాయమని చెప్పాల్సిన అవసరం బండి అండ్ కో కు ఏమొచ్చింది. ఇపుడేమైంది కవిత అరెస్టుపైన అంత ఇంట్రెస్టు చూపించిన బండే ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ఏ1 నిందితుడిగా అరెస్టయ్యారు. అందుకనే ఒకళ్ళు చెడిపోవాలని కోరుకున్నా, ఒకళ్ళని చెడగొట్టేందుకు ప్రయత్నించినా మనకు కూడా చెడే జరుగుతుందని చెప్పే నీతి సూత్రమే పై సామెత. బండి అరెస్టుకు ఎంత సరిగ్గా సరిపోతుందో కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: