"ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ నుండి కొత్త పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తనకంటూ సూపర్ క్రేజీ ను సంపాదించుకున్న పవన్ ప్రస్తుతం వరుస క్రేజీ మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో నటిస్తున్నాడు.
 

ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న తాజాగా నిన్నటి నుండే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం వేసిన పోలీస్ స్టేషన్ స్టేట్ లో ప్రారంభం అయింది. ఇలా ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం కావడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది వరకు పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటించడం ... ఆ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం ... అలాగే ప్రస్తుతం పవన్ ..  హరీష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా పవన్ పోలీస్ పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తున్న ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: