హైదరాబాద్ : అవినాష్ విషయంలో ఏం జరుగబోతోంది ? టెన్షన్..టెన్షన్

Vijayaకడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఏమి జరగబోతోంది ? వైసీపీలో ఇపుడీ టెన్షన్ పెరిగిపోతోంది. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా, విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో విచారణ చేయించాలని, విచారణ సందర్భంగా తనతో పాటు తన లాయర్ ను కూడా అనుమతించాలని అవినాష్ వేసిన కేసును తెలంగాణా హైకోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టంగా తేల్చేసింది.ఎంపీని సీబీఐ అరెస్టు చేయకుండా అడ్డుకోవటం తమ పరిధిలో లేదని చెప్పేసింది. ఆడియో, వీడియో రికార్డింగ్ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. లాయర్ ను అనుమతించాలని మాత్రం ఆదేశించింది. అదికూడా విచారణకు దూరంగా లాయర్ ను కూర్చోబెట్టాలని చెప్పింది. అంటే అవినాష్ వేసిన పిటీషన్ను హైకోర్టు నూరుశాతం కొట్టేసిందనే చెప్పాలి. మరీ దశలో సీబీఐ ఏమిచేస్తుందనేది ఆసక్తిగా మారింది.ఇప్పటివరకు అవినాష్ ను అరెస్టు చేస్తామని సీబీఐ ఎక్కడా చెప్పలేదు. పైగా అవినాష్ ను వివేకా మర్డర్ కేసులో సాక్షిగా మాత్రమే విచారణకు పిలిపించినట్లు సీబీఐ లాయర్ స్వయంగా కోర్టు లో చెప్పారు. కానీ అవినాష్ మాత్రం సీబీఐ తనను అరెస్టుచేస్తుందని ఆందోళనపడుతున్నారు. ఒకవైపు వివేకా మర్డర్ కేసులో  తనకేమీ సంబంధం లేదంటున్నారు. తనను సీబీఐ సాక్షిగా మాత్రమే పిలిచిందని ఎంపీయే చెప్పారు.అయినా తనను సీబీఐ అరెస్టుచేస్తుందని ఎంపీ ఎందుకు భయపడుతున్నట్లు ? ఇదే సమయంలో సీబీఐ తమను అరెస్టుచేసుకుంటే చేసుకోవచ్చని ఎంపీ తండ్రి భాస్కరరెడ్డి మీడియాతోనే చెప్పారు. అరెస్టుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. తండ్రే అరెస్టుకు సిద్ధంగా ఉన్నపుడు కొడుకు, ఎంపీ అయ్యుండి అవినాష్ ఎందుకు భయపడుతున్నారు ? ప్రచారం జరుగుతున్నట్లు వివేకా మర్డర్ కేసులో ఎంపీకి ఏమన్నా పాత్రుందా ? మర్డర్ కు తనకు ఎలాంటి సంబంధంలేనపుడు అవినాష్ భయపడాల్సిన అవసరమే లేదు. కుట్రచేసి ఇరికించాలని చూస్తున్నారని ఎంపీ ఆరోపించటం కూడా నమ్మేట్లుగా లేదు. ఎందుకంటే అమాయకంగా కుట్రలో ఇరుక్కునేందుకు అవినాష్ ఏమన్నా చిన్నపిల్లాడా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: