అమరావతి : ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారా ?

Vijaya



పార్టీలోకి బలమైన నేతలను చేర్చుకోవటమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారా ? అవుననే అంటున్నారు తమ్ముళ్ళు. బీజేపీలో గట్టి నేతలతో పాటు ఒకపుడు టీడీపీలో ఉండి తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన నేతలను తిరిగి ఘర్ వాపసీ పద్దతిలో పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని సమాచారం. ఇందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరటం. కన్నా బాటలోనే బీజేపీకి చెందిన ఇంకా కొందరు నేతలు టీడీపీలో చేరటానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.



మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు, వరదాపురం సూరి, ఆదినారాయణరెడ్డి తో పాటు మరికొందరు నేతలు తొందరలోనే టీడీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అలాగే వైసీపీ ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి విషయంలో కూడా ఎప్పటినుండో ఇదే ప్రచారం జరుగుతోంది. ఈయనతో పాటు నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా టీడీపీలో చేరటం ఖాయమంటున్నారు. కోటంరెడ్డి చేరికపై పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉన్నా మెల్లిగా సర్దుబాటు అయిపోతుందట.



వచ్చేఎన్నికల్లో పార్టీలోని కొంతమందికి చంద్రబాబు టికెట్లు ఇవ్వదలచుకోలేదట. అలాంటి చోట్ల ప్రత్యామ్నాయంగా గట్టి నేతలకోసం చూస్తున్నట్లు సమాచారం. టికెట్టు ఇవ్వదలచుకోని నేతల విషయంలో చంద్రబాబు ఎలాంటి ప్రకనలు చేయకపోయినా కొత్తవారిని లేదా ప్రత్యామ్నాయాలను చూసుకోవటం ద్వారా పాత నేతలకు సంకేతాలను పంపుతున్నారట. ఆళ్ళగడ్డ, నంద్యాల, వెంకటగిరి లాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే చంద్రబాబు ఇలాంటి సంకేతాలను పంపినట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు.



2019కి ముందు కూడా వైసీపీ నుండి ఇలాంటి ఆకర్ష్ ఆపరేషన్ చేసే తర్వాత ఎన్నికల్లో బోర్లా పడ్డారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పెద్దగా కనిపించటంలేదు. అలాంటిది ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. మరీసారి ఏమవుతుందో చూడాలి. ఒకవైపేమో కొత్త నేతలను చేర్చుకోవద్దని తమ్ముళ్ళు చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోవటంలేదు. మరీ దీని ఫలితం ముందు టికెట్ల కేటాయింపు తర్వాత ఫలితంపై పడటం ఖాయం. చివరికి రిజల్టు ఎలాగుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: