అమరావతి : జగన్ చేయాల్సిన సవాలు ఇదికాదా ?

Vijayaప్రతిపక్ష నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఒక సవాలు విసిరారు. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లలో పోటీచేసి గెలవగలరా ? అని చాలెంజ్ చేశారు. అయితే జగన్ చేయాల్సిన సవాలు ఇదికాదసలు. చేయాల్సిన చాలెంజ్ ఏమిటంటే అసలు 175 నియోజకవర్గాల్లో పోటీచేసేంత దమ్ముందా అని చంద్రబాబు, పవన్ కు చాలెంజ్ విసరాలి. గెలుపోటములను పక్కనపెట్టేస్తే అసలు పోటీచేయాలి కదాముందు.విడివిడిగా పోటీచేసేంత సీన్ లేదని వాళ్ళే ఒప్పేసుకున్నారు కదా.  కర్నూలు పర్యటనలో మాట్లాడుతు చంద్రబాబు ఏమన్నారు ? ప్రతిపక్షాలు దేనికదే పోటీచేస్తే మళ్ళీ జగనే సీఎం అవ్వటం గ్యారెంటీ అని అన్నారు కదా. అలాగే రణస్ధలం బహిరంగసభలో పవన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేస్తే రెండోసారి కూడా వీరస్వర్గం తప్పదని అంగీకరించారు కదా. అంటే వాళ్ళకు తెలుసు రెండుపార్టీలు విడిగా పోటీచేస్తే జరగబోయేదేమిటో ?విడివిడిగా పోటీచేయటానికే ధైర్యం లేనివాళ్ళు ఇక 175 నియోజకవర్గాల్లో ఎవరికి వాళ్ళుగా పోటీచేసేదెప్పుడు ? పోటీచేసినా గెలిచేదెప్పుడు ? 2014-19 మధ్యలో చంద్రబాబు పాలన ఎలాగుందో జనాలందరికీ అర్ధమైంది కాబట్టే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే జనాలను మోసంచేశారు. 2014లో చంద్రబాబు హామీలకు జవాబుదారీగా ఉంటానని నమ్మించి ఓట్లేయించిన పవన్ కు కూడా జనాలు బాగా బుద్ధిచెప్పారు.హామీఇచ్చిన చంద్రబాబుతో పాటు నమ్మించిన పవన్ కు కూడా జనాలు అంతగా బుద్ధిచెప్పినపుడు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఏమని హామీలిస్తారు ? ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు చెప్పనివాటిని కూడా అమలుచేశానని జగన్ పదే పదే చెప్పుకుంటున్నారు. ఇఛ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చానని జగన్ చెప్పినపుడు నెరవేర్చలేదని చంద్రబాబు, పవన్ చెప్పాలి కదా. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని ప్రతిపక్షాలూ చెప్పటంలేదు. అంటే హామీలను జగన్ నెరవేర్చినట్లే కదా అర్ధం. అదే తనకు రాబోయే ఎన్నికల్లో బలంగా మారబోతోందని జగన్ నమ్ముతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: