అమరావతి : లోకేష్ పై నెటిజన్ల సెటైర్లు

Vijaya


నారా లోకేష్ వ్యవహారశైలి చాలా విచిత్రంగా ఉంటోంది. పాదయాత్రలో భాగంగా నగిరి, శ్రీకాళహస్తిలో టికెట్లు ప్రకటించేశారు. పై రెండు నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టి నగరిలో భానుప్రకాష్ నాయుడును శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుదీర్ రెడ్డిని అభ్యర్ధులుగా ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళని అత్యధిక మెజారిటి గెలిపించాలని విజ్ఞప్తి కూడా చేశారు. మరిదే పద్దతిని తిరుపతిలో మాత్రం చేయలేదు. పై రెండు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించిన లోకేష్ తిరుపతిలో మాత్రం సభ నిర్వహించలేదు.పైగా శుక్రవారం పాదయాత్రకు దూరంగా నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో మాట్లాడుతు లోకల్ నేతల పరితీరుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. కష్టపడి పనిచేసే వారికే టికెట్ ఇస్తామని స్పష్టంగా చెప్పేశారు. మంగళగిరిలో తాను ఎంత కష్టపడుతున్నా తనకే ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదన్న విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. అయితే ఇక్కడే లోకేష్ అతి తెలివి బయటపడింది. మంగళగిరిలో లోకేష్ కు ఎవరు టికెట్ కన్ఫర్మ్ చేయాలి ? చాలా నియోజకవర్గాల్లో లోకేషే టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నారని అందరికీ తెలిసిందే.నిజంగానే మంగళగిరిలో టికెట్ కన్ఫర్మ్ కాలేదనే అనుకుందాం. మరి ఆమధ్య జరిగిన మహానాడులో మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో మంగళగిరిలో పోటీచేసి గెలుస్తానని చాలెంజ్ చేశారు కదా. మంగళగిరిలో తన గెలుపును చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తానని లోకేష్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మంగళగిరిలో పోటీచేస్తానని, గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని లోకేష్ ఎలా ప్రకటించారు ?తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుని ప్రత్యర్ధులకు ఆయుధాలను అందిస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు. తిరుపతి నేతల సమీక్షలో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తనకే టికెట్ కన్ఫర్మ్ చేయలేదని చెబుతున్న లోకేష్ మరి ఏ అధికారంతో నగిరి, శ్రీకాళహస్తి టికెట్లను ప్రకటించారో చెప్పాలని నిలదీస్తున్నారు. తిరుపతిలో మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మకు టికెట్ ఇవ్వటం ఇష్టంలేని లోకేష్ అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: