రాయలసీమ : ఇందులో లోకేష్ ఎక్స్ పర్టేనా ?

Vijaya


పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశంపార్టీ యువరాజు నారా లోకేష్ సేమ్ సైడ్ గోల్ వేసుకోవటంలో బాగా ఎక్స్ పర్ట్ లాగున్నారు.  పాదయాత్ర మొదలైన రెండురోజుల నుండి యువగళం వెలాతెలా పోతున్న విషయం తెలిసిందే. జనాలు లేక ఒకవైపు నీరసించిపోతున్న యాత్ర, లోకేష్ ముద్దమాటలు జనాలకు సరిగా అర్ధంకావటంలేదు. మొత్తంమీద పాదయాత్ర ఫెయిల్ అయ్యిందని ప్రచారం చేయటానికి వైసీపీకి లోకేషే మంచి ఆయుధాన్ని అందించారు. ఇది సరిపోదన్నట్లుగా  శ్రీకాళహస్తి యాత్రలో లోకేష్ మాట్లాడిన మాటలు సేమ్ సైడ్ గోల్ వేసుకున్నట్లే ఉంది.ఇంతకీ విషయం ఏమిటంటే ప్రత్యేకహోదా సాధన విషయంలో ఫెయిలైన 31 మంది వైసీపీ ఎంపీలను జనాలు నిలదీయాలని లోకేష్ పిలుపిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో సంజీవని లాంటి ప్రత్యేకహోదాను సాధించటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలైందని జనాలు గుర్తించాలన్నారు. ఇక్కడే లోకేష్ మాటలు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు ప్రత్యేకహోదా అంశాన్ని నాశనంచేసిందే చంద్రబాబునాయుడు. విభజన చట్టానికి తూట్లు పొడవటంలో నరేంద్రమోడీ ప్రభుత్వానికి యథాశక్తి సహకరించింది చంద్రబాబే అన్న విషయం జనాలందరికీ తెలుసు.ప్రత్యేకహోదా స్ధానంలో ప్రత్యేకప్యాకేజి ఇస్తామని కేంద్రం చెబితే అందుకు అంగీకరించింది చంద్రబాబే.  హోదాలో ఏముంది ? అని చంద్రబాబు, లోకేష్ తో పాటు అప్పటి మంత్రులంతా పదే పదే జనాలను అడిగారు. ప్రత్యేకప్యాకేజీకన్నా హోదా ఏ విధంగా మెరుగైనదో తనకు చెప్పాలని లోకేష్ అప్పట్లో చాలాసార్లు జనాలను ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేకహోదా సాధన పేరుతో యువత, విద్యార్ధులు ఆందోళనలు చేస్తే చంద్రబాబు కేసులు పెట్టించారు.తమ ఐదేళ్ళ పాలనలో ప్రత్యేకహోదాను అంశాన్ని  అన్నివిధాల భ్రష్టుపట్టించిన చంద్రబాబు, లోకేష్ ఇఫుడు ఆ తప్పును జగన్ ప్రభుత్వంమీదకు నెట్టేస్తోంది. తప్పంతా జగన్ ప్రభుత్వానిదే అని లోకేష్ చెప్పినంతమాత్రాన జనాలు నమ్ముతారా ? తమ పాలనలో ఏమిజరిగిందో జనాలకు గుర్తుండదనేది లోకేష్ నమ్మకంలాగుంది. జనాల మెమొరీ పవర్ మీద లోకేష్ కు ఎంతటి దురభిప్రాయముందో అర్ధమైపోతోంది. అందుకనే నెటిజన్లు, వైసీపీ సోషల్ మీడియా లోకేష్ తాజా పిలుపుపై చాకివేరు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: