అమరావతి : బీజేపీ కూడా వాడకం మొదలుపెట్టిందా ?

Vijayaఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో బీజేపీ కూడా ఎన్టీయార్ భజన మొదలుపెట్టినట్లుంది. ఏపికన్నా తెలంగాణాలోనే ఒకపుడు టీడీపీకి బలమైన నేతలు, క్యాడర్ ఉండేది. ఇపుడు పార్టీ శిధిలావస్ధలోకి వెళ్ళిపోయినా అభిమానులు ఉండే ఉంటారు. అందుకే రెండురాష్ట్రాల్లోను ఉపయోగపడుతుందని ఎన్టీయార్ బొమ్మతో నరేంద్రమోడీ ప్రభుత్వం రు. 100 కాయిన్ను తీసుకురావాలని డిసైడ్ చేసింది. అంటే ఇపుడున్న కాయిన్లలాగ మార్కెట్లో చెలామణికి పనికిరాదు.ఎవరికైనా గిఫ్టులుగా ఇవ్వటానికి, కాయిన్ కలెక్షన్ కు మాత్రమే పనికొస్తుంది. ఏదేమైనా ఎన్టీయార్ బొమ్మతో వెండి నాణెన్ని మార్కెట్లో విడుదల చేయటమంటే తెలుగువాళ్ళందరికీ సంతోషమే కదా. అసలు ఎన్టీయార్ బొమ్మపై మోడీ సర్కార్ కు ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది ? ఎందుకంటే కేవలం ఎన్నికల స్టంట్ అని చెప్పేయచ్చు. ఇప్పటికే ఎన్టీయార్ బొమ్మను తెలుగుదేశంపార్టీ ప్రతి అవసరానికి వాడేసుకుంటోంది. అలాగే జిల్లాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా విజయవాడ జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీయార్ పేరు పెట్టేసింది.ఎన్టీయార్ అంటే తమకే మాత్రమే ప్రేముందని చెప్పుకునే చంద్రబాబునాయుడుది అంతా నాటకమని, యూజ్ అండ్ త్రో పాలసీ అని జగన్ అండ్ కో పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి, చావుకు కారణమైన చంద్రబాబుకు ఎన్టీయార్ పేరు ఎత్తే అర్హతే లేదని అన్నగారి భార్య లక్ష్మీపార్వతి మండిపోతున్నారు. సరే ఎవరెన్ని చెప్పినా, ఏమనుకున్నా ప్రతి వర్ధంతి, జయంతికి చంద్రబాబు అండ్ కో ఘనంగా ఎన్టీయార్ విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే తామేం తక్కువ తినలేదని చెప్పుకునేందుకు బీజేపీ కూడా రెడీ అయిపోయింది. 100 రూపాయల నాణెంపై ఎన్టీయార్ బొమ్మ ముద్రించి మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం గురించి మాట్లాడని మోడీ ప్రభుత్వం వెండినాణెం మాత్రం తెస్తోంది. బహుశా రేపటి ఎన్నికల్లో ఇదే విషయాన్ని కమలంపార్టీ కూడా ప్రచారం చేసుకుంటుందేమో. ఎన్టీయార్ అభిమానులను+జూనియర్ ఎన్టీయార్ అభిమానులను తమవైపు లాక్కునేందుకే బీజేపీ ఈ ఎత్తు వేసినట్లుంది. మరి బొమ్మ అచ్చేసినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడిపోతాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: