అమరావతి : చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ?

Vijayaరాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబునాయుడు సరికొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే పార్టీలో జోనల్ విధానాన్ని తీసుకొచ్చారు. మొత్తం 175 నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి ప్రతిజోన్లో 35 నియోజకవర్గాలను ఉంచారు. ఇకనుండి ప్రతినెలా రెగ్యులర్ గా జోనల్ సమావేశాలను నిర్వహించటం ద్వారా నేతలు, ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కార్యకర్తలతో కూడా టచ్ లో ఉండాలని డిసైడ్ అయ్యారు. బుధవారం జరిగిన పార్టీ స్ట్రాటజీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించారు.ఈనెల 21వ తేదీ నుండి 25వ తేదీవరకు ఐదుజోన్ల సమావేశాలను నిర్వహించబోతున్నట్లు కూడా ప్రకటించారు. జోన్ల సమావేశానికి నియోజకవర్గాల్లోని నేతలంతా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాల్సిందే అని చంద్రబాబు ఆదేశించారు. మరీ కొత్త జోన్లవారీ విధానం వల్ల పార్టీకి వచ్చే లాభం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. చంద్రబాబు చెప్పారు మిగిలిన నేతలు సరేనన్నారంతే. ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాతోనే చంద్రబాబు సరికొత్త జోనల్ విధానాన్ని ఏర్పాటుచేసినట్లు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.ముందస్తు ఎన్నికలకు, పార్టీలో జోనల్ విధానాన్ని తేవటానికి ఏమిటి లింకనేది అచ్చెన్నే చెప్పాలి. అచ్చెన్న లెక్కప్రకారం రాబోయే ఎన్నికల్లో పార్టీకి 160 సీట్లు ఖాయమట. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగా దిగజారిపోయిందట. బడ్జెట్ తర్వాత కేంద్రం నుండి అందుకునే నిధులను రాబట్టుకుని రెండుమూడు నెలల్లో జగన్ ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకోబోతున్నట్లు అచ్చెన్న చెప్పటం గమనార్హం.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండటంలో భాగంగానే కొత్తగా జోనల్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కొత్తపద్దతి వల్ల పార్టీ నేతలకు ఏ విధంగా లాభమో మాత్రం అచ్చెన్న చెప్పలేకపోయారు. సరే ఎన్నికల్లో గెలుపుకు ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. అయితే ఎవరే వ్యూహాలు రచించినా అది జనాలకు దగ్గరయ్యేందుకే అయ్యుండాలి. కానీ ఇపుడు కొత్తగా ప్రవేశపెట్టిన జోనల్ విధానంతో పార్టీ నేతలు జనాలకు ఏ విధంగా దగ్గరవుతారనే విషయంలో క్లారిటి మిస్సయినట్లున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: