తెలంగాణ బడ్జెట్: మొత్తం ఎన్ని కోట్లు? పూర్తి వివరాలు?

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది.ఇక ఆర్థిక మంత్రి అయిన హరీష్ రావు మొత్తం రూ.290396 కోట్లతో బడ్జెట్ ను సభ ముందు ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది.తెలంగాణ రాష్ట్రం మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లు అని ఆర్ధిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.211685 కోట్లుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా అలాగే మూలధన వ్యయం 37525 కోట్లు వ్యవసాయానికి కేటాయింపులు రూ.26831 కోట్లుగా ఉంటుందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్ల వ్యవసాయం వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7994 కోట్ల నిధులు మాత్రమే ఖర్చు చేయగా.. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి దాకా తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 91వేల 612 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు. అంటే ఏకంగా 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు.


గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రైతుబంధు రైతుభీమా వ్యవసాయానికి ఏకంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీ చెరువుల పునరుద్దరణ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ఇంకా భారీ ప్రాజెక్టుల నిర్మాణం, అలాగే సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ ఇంకా కల్తీ విత్తనాల నియంత్రణ అలాగే వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం, రైతు వేదికలు ఇంకా పంట కల్లాల నిర్మాణం అలాగే రైతు సమితుల ఏర్పాటు చేశారు.తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయం నీటి పారుదల శాఖకు ఆయన ఎక్కువ కేటాయింపులు చేశారు. ఇక ఎస్పీ ప్రత్యేక నిధికి అత్యధిక కేటాయింపులు దక్కాయి. ఏకంగా రూ.36750 కోట్లని కేటాయించారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖకు మొత్తం రూ.26885 కోట్లు అలాగే వ్యవసాయానికి రూ.26831 కోట్లు ఇంకా విద్యుత్ కేటాయింపులు రూ.12727 కోట్లు, మరియు ఆసరా ఫించన్ల కోసం రూ.12 వేల కోట్లు ఇంకా దళితబంధు రూ.17700 కోట్లు, అలాగే ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15233 కోట్లు,  బీసీ సంక్షేమం కోసం మొత్తం రూ.6229 కోట్లు మహిళా శిశు సంక్షేమం కోసం మొత్తం రూ.2131 కోట్లు కేటాయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: