బీజేపీలో ఈటల రాజేందర్ కు కష్టకాలం రానుందా ?

VAMSI
తెలంగాణలో తెరాస పార్టీలో సుదీర్ఘ కాలం ఉండి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ గురించి అంతా తెరచిన పుస్తకమే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈటలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాడు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో కేసీఆర్ కు టార్గెట్ గా మారదు ఈటల రాజేందర్. ఆ తర్వాత జరిగిన అన్ని పరిణామాలు అందరికీ తెలిసినవే. అయితే తెలంగాణ ప్రభుత్వం తనపై ఎన్ని విమర్శలు అభాండాలు వేసినా తాను నిజాయితీ కలిగిన నాయకుడని ఘంటాపధంగా చెబుతూ వచ్చాడు. అయితే అప్పటికే ఈటల శక్తిని పసిగట్టిన జాతీయ పార్టీ బీజేపీ తనకు ఆహ్వానం పలికింది.
అలా ఈటల పార్టీకి మరియు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటి నుండి బీజేపీ లో ఈటల చేరిక కమిటీకి చైర్మన్ గా ఎంపికయ్యాడు. అయితే ఎమ్మెల్యే అయిన కొత్తల్లో ఈటలకు సన్నిహితులు గా ఉన్న కొందరు బీజేపీలో చేరినా, ఆ తర్వాత పెద్దగా ఎవ్వరూ చేరకపోవడం గమనార్హం. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ అధిష్టానం అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యానని భావనలో ఈటల ఉన్నారట. ఇక ఈ మధ్యనే ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీలో కేసీఆర్ కు నమ్మకంగా పని చేసే వారున్నారని, తద్వారా పార్టీని మోసం చేసే నాయకులు ఉన్నారంటున్నారు.
అందుకే ఇతర పార్టీల ఉండి నాయకులను చేర్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నానంటూ బాధపడినట్లు తెలుస్తోంది. అయితే ఇలా సొంత పార్టీలోనే ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు పార్టీని అభివృద్ధి చేయడం కష్టతరమే అవుతుందని వాపోతున్నాడు. ఇది ఇలాగె కొనసాగితే ఈటల రాజేందర్ పార్టీలో కొనసాగడం కష్టం అవుతానందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారట. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏమి జరగనుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: