అమరావతి : నమ్మించి ముంచేయటం అంటే ఇదేనా ?

Vijayaచంద్రబాబునాయుడును నమ్మి బాగుపడిన వాళ్ళు లేరు అనేది జనరల్ టాక్. ఇదే సమయంలో చంద్రబాబును నమ్ముకుని నాశనమైపోయామని చాలామంది చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. చరిత్రను వదిలేస్తే తాజా ఉదాహరణ ఎవరయ్యా అంటే సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పేరు వినిపిస్తోంది. చంద్రబాబుకు రామకృష్ణ ఎంతటి మద్దతుదారుడో అందరికి తెలుసు.  చంద్రబాబుకు మద్దతిచ్చే విషయంలో పార్టీ లైన్ దాటేసి మరీ మద్దతుదారుడిగా మారిపోయారు.అలాంటి రామకృష్ణను ఓ కేసు విషయంలో హైకోర్టు ఫుల్లుగా వాయించేసింది. జీవో 1 కి విరుద్ధంగా రామకృష్ణ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయాల్సిన అవసరం సీపీఐకి లేదు. ఎందుకంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డుషోల పేరుతో రోడ్లపైన సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులు కూడా ఎందుకు జారీచేసిందంటే చంద్రబాబునాయుడు పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో 11 మంది చనిపోయిన తర్వాతే.గ్రౌండ్ లెవల్లో జరిగిన డెవలప్మెంట్లకు ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ కరెక్టే. అయితే విచిత్రంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలంతా తీవ్రంగా తప్పుపట్టారు. రామకృష్ణ అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఏకంగా కోర్టులో పిటీషనే వేశారు. సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ అత్యవసర కేసు కింద పరిగణించాలని కోరుతు వెకేషన్ బెంచ్ లో  రామకృష్ణ లంచ్ మోషన్ రూపంలో మూవ్ చేశారు. బెంచ్ కూడా వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేసి ఉత్తర్వులను 23వ తేదీవరకు సస్పెండ్ చేసింది.సీన్ కట్ చేస్తే 23వ తేదీన కేసును విచారించిన చీఫ్ జస్టిస్ కేసు వేసిన రామకృష్ణను, విచారించిన వెకేషన్ బెంచ్ పై తీవ్రస్ధాయిలో మండిపోయారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో తప్పేముందని నిలదీశారు. లంచ్ మోషన్ మూవ్ చేయటంలోను, ఉత్తర్వులను సస్పెండ్ చేయటం వెనుక ఏమి జరిగిందో తనకు పూర్తిగా తెలుసంటు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు విషయం ఏమిటంటే రామకృష్ణతో కేసు వేయించిందే చంద్రబాబని అప్పట్లోనే బాగా ప్రచారం జరిగింది. ఇపుడు కోర్టులో అక్షింతలు వేయించుకున్నది రామకృష్ణే కానీ చంద్రబాబు కాదు. చంద్రబాబును నమ్ముకున్నందుకు రామకృష్ణకు తగిన శాస్తే జరిగిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: