అమరావతి : పవన్ మరీ ఇంత పిరికివాడా ?

Vijaya





జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చేఎన్నికల్లో కూడా గెలుపుపైన నమ్మకంలేదా ? నాగబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కర్నూలులో మీడియాతో నాగబాబు మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయం సస్పెన్సన్నారు. పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ఇపుడే బయటపెట్టేది లేదని చెప్పారు. దీంతో  పోటీచేయాలంటేనే పవన్ భయపడుతున్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి.



పవన్ పోటీచేయబోయే నియోజకవర్గంపై సస్పెన్స్ మైన్ టైన్ చేయాల్సిన అవసరం ఏమిటో అర్ధంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఉన్నట్లే, చంద్రబాబునాయుడుకు కుప్పం ఉంది. అలాగే నారా లోకేష్ మంగళగిరిలో పోటీచేయబోతున్నారు. సీనియర్లు లేదా ప్రముఖులందరికీ కచ్చితమైన నియోజకవర్గం అనేది ఒకటుంది. గెలుపోటములతో సంబంధంలేకుండా అందరు తమ నియోజకవర్గాల నుండే పోటీచేస్తారు. కానీ అసలు నియోజకవర్గమే లేని పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ మాత్రమే.



పోయిన ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీచేసి రెండోచోట్లా ఓడిపోయారు. అప్పటినుండి పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాలంటు పెద్ద లిస్టే చక్కర్లు కొడుతోంది. మీడియా, సోషల్ మీడియా ప్రకారం తిరుపతి, కాకినాడ రూరల్, పిఠాపురం, విశాఖ ఉత్తరం, భీమిలీ, భీమవరం, గాజువాక నియోజకవర్గాలు ప్రచారంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని నియోజకవర్గాల పేర్లు బయటకు వస్తాయో తెలీదు. పోటీచేయబోయే నియోజకవర్గాన్ని పవన్ బయటపెట్టనంత వరకు ఇలాంటి ప్రచారాలు జరుగుతునే ఉంటాయి.




అసలు తాను పలానా నియోజకవర్గంలో పోటీచేయబోతున్నాని చెప్పటానికి పవన్ ఎందుకు వెనకాడుతున్నారనే విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. నియోజకవర్గాన్ని ఇపుడే ప్రకటిస్తే తనను ఓడించేందుకు వైసీపీ ముందుగానే ప్లాన్ వేసుకుంటుందని పవన్ భయపడుతున్నారా ?  తనను ఓడించటానికి జగన్ ఎలాగైనా ప్లాన్ చేస్తాడన్న విషయాన్ని పవన్ మరచిపోయారు. ఎందుకంటే తాను ఎక్కడినుండి పోటీచేయబోయేది పవన్ కనీసం నెలరోజుల ముందన్నా ప్రకటించాల్సుంటుంది. పవన్ను ఓడించేందుకు జగన్ ప్లాన్ చేయటానికి ఆ సమయం సరిపోతుంది. కనీసం నామినేషన్ వేసే ముందైనా ప్రకటించాల్సిందే కదా. అప్పుడైనా జగన్ ప్రయత్నిస్తారు కదా. హేమిటో పవన్ మరీ ఇంత పిరికి వ్యక్తనుకోలేదు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: