అమరావతి : టీడీపీ అక్కసు బయటపడిందా ?

Vijaya


జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశంపార్టీలో ఎంత అక్కసు పేరుకుపోయిందో మరోసారి బయటపడింది. జగన్ కు వ్యతిరేకంగా తన అక్కసును వెళ్ళగక్కేందుకు ఈసారి దావోస్ సదస్సును ఎంపికచేసుకుంది. దావోస్ నుండి ఆంధ్రప్రదేశ్ కు ఈ ఏడాది అందని ఆహ్వానం అంటు పెద్దఎత్తున బురదచల్లేస్తోంది. అక్కడికేదో దావోస్ నుండి ఆహ్వానం అందకపోవటం నేరం, ఘోరమన్నట్లుగా టీడీపీ ప్రచారం చేస్తోంది. చంద్రబాబునాయుడుకు క్రమంతప్పకుండా దావోస్ నుండి ఆహ్వానం అందేదని గుర్తుచేస్తోంది.చంద్రబాబుకు అందిన ఆహ్వానం ఇపుడు వైసీపీ ప్రభుత్వానికి అందలేదంటే జగన్ విధ్వంస పరిపాలన గురించి తెలుసుకునే నిర్వాహకులు జగన్ కు ఆహ్వానం పంపలేదని నానా రచ్చచేస్తోంది. అయితే విషయం ఏమిటంటే దావోస్ సదస్సులో పాల్గొనాలని నవంబర్ 25వ తేదీనే జగన్ కు ఆహ్వానం అందింది. మార్చి 3,4 తేదీల్లో విశాఖలోనే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న కారణంగా మళ్ళీ దావోస్ కు వెళ్ళాల్సిన అవసరం లేదని జగన్ అనుకున్నారు. అందుకనే ఆహ్వానం అందినా జగన్ దావోస్ కు వెళ్ళలేదు.ఈ విషయం టీడీపీకి తెలిసినా సరే తనదైన పద్దతిలో అక్కసు ప్రదర్శిస్తోంది. అసలు దావోస్ కు కచ్చితంగా వెళ్ళాలని ఏముంది ? వెళ్ళటం వెళ్ళకపోవటం ముఖ్యమంత్రి ఇష్టం. టీడీపీ హయాంలో దావోస్ నుండి ఆహ్వానం అందకపోయినా కోట్ల రూపాయలు పెట్టి ఆహ్వానాన్ని కొనుక్కుని మరీ చంద్రబాబు వెళ్ళినట్లు ఆధారాలతో సహా బయటపడింది. ఆహ్వానితుల జాబితాలో కాకుండా మెంబర్ షిప్ కొనుక్కుని హాజరైన వాళ్ళజాబితాలో చంద్రబాబు పేరు కనబడింది. దాంతో అప్పట్లోనే చంద్రబాబు బండారం బయటపడింది.
అయినా అన్నిసార్లు చంద్రబాబు దావోస్ వెళ్ళటం వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం జరిగింది ? ఐదేళ్ళు చంద్రబాబు వరుసగా దావోస్ వెళ్ళిన కారణంగా రు. 39 కోట్ల ఖర్చు తప్ప ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ఈ విషయాన్ని ఇండస్ట్రీయిల్ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ డిపార్ట్ మెంటు (ఐఐపిడీ) అధికారికంగా ప్రకటించింది. వివిధ కంపెనీలతో ఎంవోయూలు కుదిరాయే కానీ ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదని ఐఐపిడీ చెప్పింది. వాస్తవం ఇలాగుంటే టీడీపీ మాత్రం జగన్ దావోస్ వెళ్ళకపోవటంపై ఎంతటి అక్కసును వెళ్ళగక్కుతోందో ఆశ్చర్యంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: