ఉత్తరాంధ్ర : చంద్రబాబు విషయంలో బీజేపీ అలర్టుగానే ఉందా ?

Vijaya






అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడిన మాటలన్నింటినీ బీజేపీ నేతలు బాగానే గుర్తుపెట్టకున్నారు. వైజాగ్ లో మీడియాతో ఇదే విషయాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి స్పష్టంచేశారు. అవసరం లేకపోయినా నరేంద్రమోడీ తల్లి, భార్య గురించి చంద్రబాబు నోటికొచ్చింది అవమానకరంగా  మాట్లాడారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తాను మళ్ళీ సీఎం అయిపోతానని, నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా దిగిపోతారనే భ్రమల్లో చంద్రబాబు ఉండేవారు.



అందుకనే అసెంబ్లీ సమావేశాల్లో మోడీ తల్లి, భార్య గురించి చెత్తంతా మాట్లాడారు. అదే విషయాన్ని విష్ణు గుర్తుచేశారు. అప్పట్లో మోడీ తల్లి, భార్య గురించి చంద్రబాబు ఏమేమి మాట్లాడారో తమకు అంతా గుర్తుందన్నారు. మోడీని చంద్రబాబు అవమానించలేదా ? తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన అమిత్ షా పైన చంద్రబాబు రాళ్ళు వేయించలేదా ? అంటు మండిపోయారు. తమ విషయంలో చంద్రబాబు చేసిన వన్నీ తమకు బాగా గుర్తున్నాయన్నారు.



అందుకనే చంద్రబాబు మాయలో పడేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పేశారు. చంద్రబాబుకు అవసరం వచ్చినపుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందని విష్ణు ఎద్దేవాచేశారు. అధికారంలో ఉన్నపుడు ఒకలాగ, ప్రతిపక్షంలోకి వచ్చినపుడు మరోలాగ మాట్లాడటం చంద్రబాబుకు బాగా అలవాటే అన్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతోనే మోడీ చుట్టూ చంద్రబాబు తిరుగుతున్నట్లు విష్ణు మండిపోయారు. చంద్రబాబు ఒక మేకవన్నెపులంటు విష్ణు వర్ణించారు.



బీజేపీతో పొత్తు ఉంటుందని జనాలను నమ్మించేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని జనాలందరు గ్రహించాలన్నారు. చంద్రబాబు మాయలో పడేంత అమాయకులు బీజేపీలో ఎవరూలేరని కూడా విష్ణు గుర్తుచేశారు. విష్ణు చెప్పిందంతా నిజమే కానీ పొత్తులు డిసైడ్ అయ్యేది రాష్ట్రంలో కాదు ఢిల్లీలో అని కూడా అందరికీ తెలుసు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని మోడీ అనుకుంటే అప్పుడు విష్ణు ఏమి చేయగలరు ? రాజకీయాల్లో శాశ్వత శతృవులు,  శాశ్వత మిత్రులుండరన్న విషయం అందరికీ తెలిసిందే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: