అమరావతి : పవన్ పై సెటైర్లు భలే పేలుతున్నాయిగా ?

Vijaya



ఏ ముహూర్తాన చంద్రబాబునాయుడుతో  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారో అప్పటినుండి వరుసగా సెటైర్లు భలే పేలుతున్నాయి.  వీళ్ళిద్దరి భేటీపై ఆరోపణలు, విమర్శలు ఎప్పటినుండో ఉన్నవే. కానీ ఆదివారం భేటీ తర్వాత ఇవన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆరోపణలను, విమర్శలను పక్కనపెట్టేస్తే అదనంగా సెటైర్లు మాత్రం హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ సెటైర్లలో కూడా రెండు టాప్ లో నిలిచాయి. మొదటిదేమో రామ్ గోపాల వర్మ చేసిన ట్వీట్. రెండోదేమో వైసీపీ సోషల్ మీడియా చేసింది.




వర్మ ట్వీట్ ఏమో ఇటు టీడీపీ వాళ్ళతో పాటు అటు కాపు ప్రముఖులను బాగా కెలికేసింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే ‘కేవలం డబ్బుకోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు..RIP కాపులు, కంగ్రాట్చులేషన్స్ కమ్మోళ్ళు’ అని. దీనిపైన టీడీపీ నేతలు వర్మ మీద మండిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు కాపు ప్రముఖులు పవన్ పైన కారాలు మిరియాలు నూరుతున్నారు. కాపు ప్రముఖుల్లో  చాలామంది చంద్రబాబుతో చేతులు కలపద్దని పవన్ కు ఎప్పటినుండో చెబుతున్నారు. అయినా పవన్ వీళ్ళని లెక్కచేయలేదు.



సరే ఇక రెండో సెటైర్ ఏమిటంటే పవన్ ప్యాన్ ఇండియా స్టార్ ఎందుకు కాలేదు ? పవన్ నాయుకుడు ఎందుకు కావటంలేదు ? అంటు రెండు ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. దీని పూర్తి సారంశం ఏమిటంటే పవన్ కన్నా వెనకాల సినిమాల్లోకి ప్రవేశించిన అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పవన్ కన్నా లేటుగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మరి పవన్ మాత్రం ఎందుకు కాలేకపోయాడు ?



ఎందుకంటే పవన్ ఎక్కువగా రీమేకుల మీదే ఆధారపడ్డారని వాళ్ళే తేల్చేశారు. రీమేక్ సినిమాల మీద ఆధారపడ్డవాళ్ళు ఎప్పటికీ ప్యాన్ ఇండియా స్టార్లు కాలేరట. అలాగే పవన్ ఎందుకు నాయకుడు కాలేకపోయాడనే ప్రశ్నకు సింపుల్ గా చంద్రబాబు మీద ఆధారపడ్డారు కాబట్టే అని ఆన్సర్ ఇచ్చేశారు. వర్మ ట్వీట్ తో పాటు వైసీపీ తాజా సెటైర్  కూడా బాగా వైరల్ అవుతోంది. ముందు ముందు ఇంకెన్ని వస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: