హైదరాబాద్ : కేసీయార్ వన్నీ బోగస్ హామీలేనా ?

Vijayaబీఆర్ఎస్ కేంద్రంలో  అధికారంలోకి రాగానే ఇపుడు కేంద్రప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్న సంస్ధలన్నింటినీ తిరిగి ప్రభుత్వంలోకి తెస్తానని కేసీయార్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వైజాగ్ స్టీల్స్, ఎల్ఐసీలను ప్రైవేటు రంగం నుండి వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీచేయబోతున్న కారణంగా  బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ ఏవేవో హామీలిచ్చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంట మూగవాడు అమ్మా అనేదెప్పుడు అనే నానుడి గుర్తుకొస్తోంది.మూగవాడు అమ్మా అనేదెప్పుడు అంటే మూగవాడు అమ్మా అనలేడని అర్ధమే కానీ వాళ్ళని అవమానించటం కాదు. అలాగే కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెప్పుడు ? సింగిల్ గా అధికారంలోకి వస్తుందా లేకపోతే ఎవరితో జతకడుతుంది ? లేకపోతే ఏదైనా కూటమిలో చేరుతుందా ? ఇలాంటి విషయాలపై కేసీయార్ ఎప్పుడూ క్లారిటి ఇవ్వరు. ఎందుకంటే కేసీయార్ కే ఆ విషయాలపై క్లారిటి లేదుకాబట్టే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదెప్పుడు ఇపుడు మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్న సంస్ధలను తిరిగి స్వాదీనం చేసుకునేదెప్పుడు ?కేసీయార్ చెప్పినవేవీ జరిగేపనులు కాదు. ఎందుకంటే కేంద్రం నుండి కొనుగోలు చేసిన ప్రభుత్వరంగ సంస్ధలను ప్రైవేటుయాజమాన్యాలు మళ్ళీ వదులుకుంటాయా ? ఒకవేళ కేసీయార్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే యాజమాన్యాలు కోర్టుకెళ్ళవా ? ఏదో నోటికొచ్చిన హామీలిచ్చేయటం వాటిని ప్రశ్నించిన  ప్రతిపక్షాలు, మీడియాపై నోరుపారేసుకోవటం కేసీయార్ కు బాగా అలవాటైపోయింది.అందుకనే కేసీయా చెబుతున్నది సొల్లని తెలిసినా మీడియా కూడా పెద్ద ప్రశ్నించటం లేదు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. వచ్చేఎన్నికల్లో తెలంగాణాలోని 17 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటే అదే చాలా ఎక్కువన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ పరిస్ధితి. 17 సీట్లనూ గెలుచుకుంటుందని గట్టిగాచెప్పలేని కేసీయార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇపుడు బీఆర్ఎస్ లో చేరిన నలుగురు ఏపీ నేతల గురించి మామూలు జనాల్లో ఎంతమందికి తెలుసు ? ఇలాంటి వీళ్ళని వజ్రాల్లాంటి నేతలంటు కేసీయార్ అభివర్ణించటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: