ఎల్ఐసి లో అదిరిపోయే ప్లాన్.. రూ.50 లక్షల పొందే అవకాశం..

Satvika
ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి గురించి అందరికి తెలిసిందే..అతి పెద్ద భీమా కంపెనీ..ఎన్నో లాభాలు ఇచ్చే పథకాలు ఉన్నాయి..అయితే ఈ సంస్థ రెండు టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ని నిలిపివేసి, వీటి స్థానంలో మరో రెండు కొత్త పాలసీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ పాలసీల విషయానికొస్తే.. ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ప్రకటించింది..ఇకపోతే ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే కేవలం రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి ఇది మంచిది..



ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ కాబట్టి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏమీ ఉండవు. పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయ పడుతుంది..ఇకపోతే ఈ పాలసీని తీసుకొనే 18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపు ఈ పాలసీ టైం  ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000. గరిష్టంగా ఎంత మొత్తానికైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది..



మీ వయస్సు 20 ఏళ్ళు అయితే మీరు 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.50 లక్షలకు టర్మ్ ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.5,959 + జీఎస్‌టీ చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.57,768 + జీఎస్‌టీ చెల్లిస్తే చాలు. అతనికి 20 ఏళ్ల పాటు రూ.50 లక్షల కవరేజీ లభిస్తుంది..ఆ డబ్బులు వారి కుటుంబానికి చెందుతాయి.. ఇవే కాకుండా మెచ్యురిటీ సమయానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది...పాలసీ 5 ఏళ్లు ముగిసిన తర్వాత ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. 15వ ప్రీమియం చెల్లించేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: