పోస్టాఫీసు లో వడ్డీ రేట్లు పెంపు..ఆ స్కీమ్ లకు నో చేంజ్..

Satvika
ప్రతి ఒక్కరూ పొదుపు పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు..ఇది నిజంగానే బెస్ట్ ఆలోచన..పొదుపు పథకాలలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నవి మాత్రం పోస్టాఫీసు పథకాలు అనే చెప్పాలి.. సేఫ్ గా ఉండటంతో పాటు మంచి రాబడిని ఇస్తున్నాయి.. అందుకే ఎక్కువ మంది వీటిలో మొగ్గు చూపుతున్నారు.. డిపాజిట్ చేస్తే ప్రభుత్వ భరోసా ఉంటుందనే నమ్మకం తో ఎక్కువ మంది పోస్టాఫీస్ లో డిపాజిట్ చేస్తారు. ఈ స్కీమ్స్ అన్నీ కూడా మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి..దాంతో త్వరగా సంపన్నులుగా మారుతారు..

ప్రస్తుతం అన్ని బ్యాంకుల మాదిరిగానే ఇండియా పోస్ట్ తన వడ్డీ రేట్లేను సవరించింది. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయి.. పెరిగిన వడ్డీ రేట్లను చూస్తే.. ముఖ్యంగా సేవింగ్స్ ఖాతాకు 4 శాతం, వన్ ఇయర్ టెర్మ్ డిపాజిట్ కు 6.6 శాతం, 2 సంవత్సరాలకు 6.8 శాతం, మూడు సంవత్సరాలకు 6.9 శాతం, ఐదు సంవత్సరాలకు 7.0 శాతం వడ్డీని పెంచింది. అయితే 5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న రికరింగ్ డిపాజిట్లకు 5.8 శాతం, అలాగె మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీమ్ కు 7.1 శాతం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కు 7.0 శాతం, కిసాన్ వికాస్ పత్రానికి 7.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది..

ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వున్న తమ ఖాతా దారులకు ప్రత్యేకంగా సీనియర్ సిటీజన్లకు అధిక వడ్డీని ఇస్తుంది.. అందులో సీనియర్ సిటీజన్లకు మాత్రమే..సిటిజన్లకు ఏకంగా 8 శాతం వడ్డీని ఇస్తుంది. కానీ పబ్లిక్ పావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పీపీఎఫ్ కు ప్రస్తుతం 7.1 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్లకు 7.6 శాతం వడ్డీ వస్తుంది...ఎటు చూసుకున్నా కూడా ఆ పోస్టాఫిస్ లో వస్తున్న అన్నీ పథకాలు కూడా మంచి బెనిఫిట్స్ ను ఇస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: