2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే సీట్లెన్ని ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ అఫ్ ది అట్రాక్షన్ మారుతాము అనుకుంటున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. ఒంటరిగా పోటీ చేసిన కొన్ని ఎంపీ మరియు ఎమ్మెల్యే స్థానాలలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే జనసేన నేత విజయం సాధించారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తగా పోటీ చేసిన రెండు చోట్ల గాజువాక మరియు భీమవరం లలో ఓడిపోయాడు. మొదటిసారి పోటీ చేసిన జనసేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయినప్పటికీ జనసేన నేత ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ప్రజల మధ్యకు వెళుతూ వాళ్ళ తరపున అధికార పార్టీ వైసీపీని వివిధ సమస్యలను పరిష్కరించమని ప్రశ్నిస్తూ మళ్ళీ ప్రజలలో ఆశలను రేకెత్తిస్తున్నాడు.
ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రజల అభిమానం బాగా పెరిగింది అని చెప్పాలి. కానీ ఒకే ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ గా లేదు అన్నది జనసేన అభిమానుల్లో ఉన్న సందేహం. 2024 లో జరగనున్న  ఎన్నికల్లో జనసేన ఏ వైపుకు వెళ్లనుంది ? ఒంటరిగా పోటీ చేస్తుందా ? టీడీపీతో జత కట్టనుందా ? బీజేపీ తో జత కడుతుందా ? అన్నది ఇంకా తేల్చలేదు. ప్రజలు కూడా పొత్తుల గురించి క్లారిటీ వచ్చాకనే పవన్ కు ఓటు వెయ్యాలా లేదా అన్నది ఆలోచిస్తారు ? అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం జనసేన ఒంటరిగా పోటీ చేస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది.. కనీసం కొన్ని సీట్లు అయినా గెలుచుకునే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా అటు టీడీపీ తో పొత్తు పెట్టుకున్నా ? లేదా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఓటింగ్ శాతం తగ్గే అవకాశం లేకపోలేదు. ఇటు పార్టీల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నది కాదనలేని వాస్తవం. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సమీకరణాలను మనసులో పెట్టుకుని ప్రాణాలకులను చేసుకోవాలి, లేదంటే గత ఎన్నికల ఫలితమే పునరావృతం కావొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: