అమరావతి : పెత్తనమంతా యువనేతదేనా ?

Vijayaవచ్చేఎన్నికలకు సంబందించి టికెట్ల కేటాయింపులో పెత్తనమంతా చినబాబు నారా లోకేష్ దే అనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకే కేటాయిస్తానని ఎప్పుడైతే చంద్రబాబునాయుడు చెప్పారో అప్పటినుండే లోకేష్ పాత్ర కీలకమైపోయిందట. కీలకపాత్రంటే లోకేష్ ఏమిచేస్తారంటే ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. అయినా లోకేష్ ఇది చేస్తారు అది చేయలేరు అనే తేడా ఏమీలేదు కదా.పార్టీలో ఏమి జరిగినా మొత్తం లోకేష్ పేరుమీదే జరుగుతోంది. సినియర్లు, జూనియర్లనే తేడాలేకుండా అందరు నేతలతోను ఎక్కువగా లోకేషే మాట్లాడుతున్నారట. లోకేష్ ప్రయారిటీస్ ఏమిటంటే సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లాంటి వాటిల్లో ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారనే విషయంతో పాటు జనాల్లో ఎక్కువగా తిరుగుతున్నదెవరనే విషయాలపై తన మనుషుల ద్వారా ఆరాలు తీస్తున్నారట. వీళ్ళల్లో ఎక్కువగా యువత పైనే దృష్టిపెట్టారట.దాంతో లోకేష్ మోడెస్ ఆపరెండీ తెలుసుకున్న నేతలంతా లోకేష్ తో టచ్ లో ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో, పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే టికెట్ల కేటాయింపులో లోకేష్ తనవర్గంగా ముద్రపడిన వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు అనుమానంగా ఉంది. సీనియర్లలో ఎవరికి టికెట్లివ్వాలి ? అనే విషయాలను చంద్రబాబు చూసుకుంటే యువతకు టికెట్ల విషయాన్ని లోకేష్ చూసుకుంటారని సమాచారం.ఇందుకు తగ్గట్లే జనవరి 27వ తేదీనుండి మొదలుపెట్టబోయే పాదయాత్రను లోకేష్ తన వర్గం నేతలతోనే మాట్లాడి డిజైన్ చేసుకుంటున్నారు. పాదయాత్రలో ఆసాంతం యువత ఎక్కువగా ఉండేట్లు ప్లన్ చేస్తున్నారు. దీనివల్ల టీడీపీ అంటే యువనేతలతో ఉత్సాహంగా ఉండే పార్టీగా జనాల్లో కలరింగ్ ఇవ్వాలన్నది అసలు ప్లాన్. ప్రస్తుతం లోకేష్ దృష్టి ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలపైనే కేంద్రీకృతమై ఉందట. తొందరలోనే పై జిల్లాల్లోని యువనేతలతో సమావేశం పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పాదయాత్ర రాయలసీమలోని కుప్పంలో మొదలై శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. కాబట్టే యువనేతలతో సమావేశం పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: