క్రెడిట్ కార్డులను ఇలా వాడితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Satvika
ఉద్యోగం చేస్తూ నెలవారి జీతాలను అందుకుంటే వారికి క్రెడిట్ చాలా ఉపయోగకరం అని అందరికి తెలిసిందే.. అయితే క్రెడిట్ కార్డులను ఎలా వాడాలో తెలియకుంటే మాత్రం ఇబ్బందుల లో పడతారు.మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే.. మీరు వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలి. ఇక క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచినప్పటికీ మన అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలి. అలా ఉపయోగించినప్పుడు మాత్రమే మన క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాదు. అలాగే, క్రెడిట్ కార్డ్‌లను సక్రమంగా ఉపయోగిస్తున్నా.. ఈఎంఐ లు చెల్లిస్తున్న కస్టమర్‌లకు బ్యాంకులు అనేక లాభ దాయక అవకాశాలను కూడా అందిస్తాయి. రుణాలివ్వడం కూడా అందులో ఒకటే..

బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందాలంటే మాత్రం చాలా ప్రాసెస్ ఉంది.. కానీ, ఎటువంటి హామీని అందించకుండా క్రెడిట్ కార్డ్ రుణాన్ని పొందవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే రుణాలతో పోలిస్తే, క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ ఎక్కువగా నే ఉంటుంది.. 16 నుంచి 18 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఈ లోన్‌లను 36 నెలల వరకు ఈఎంఐలు గా తిరిగి చెల్లించవచ్చు. ఈ రుణానికి క్రెడిట్ లిమిట్‌ తో సంబంధం లేదు. ఎలాంటి డాక్యుమెంట్స్  ఇవాల్సిన అవసరం లేదు.

క్రెడిట్ కార్డ్‌ తో రుణం తీసుకోవడం కంటే నగదు తీసుకోవడం మీ క్రెడిట్ పరిమితిని ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉపసంహర ణలకు 36 నుండి 48 శాతం వడ్డీ వసూలు చేస్తారు.. అందుకే లోన్ తీసుకోవడం మంచిది.. 6 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. కొన్ని కంపెనీలు ఐదేళ్ల వరకు కాలపరిమితిని అందిస్తాయి. ఈ బ్యాంకులే చాలా ఉపయోగకరమైన అవకాశాలను అందిస్తున్నాయి.. ఈ అవకాశా లు కరెక్ట్ గా ఉండాలంటే మాత్రం క్రెడిట్ కార్డు ఈఎంఐ లను కట్టాలి..ఈ విషయాలను తప్పక తెలుసుకోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: