హైదరాబాద్ : టెన్షన్..టెన్షన్ విచారణలో ఏం జరుగుతోంది ?

Vijayaఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా కల్వకుంట్ల కవితను సీబీఐ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కవిత ఇంటికి 11 మంది అధికారులు వెళ్ళారు. రాఘవేంద్ర వత్స అనే అధికారి నాయకత్వంలో పెద్ద బృందమే గంటల తరబడి విచారణ చేస్తోంది. సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తోంది, కవిత ఏమి సమాధానాలు చెబుతున్నారో బయటవారికి ఎవరికీ తెలీదు.రెండుసార్లు వాయిదాపడిన విచారణ చివరకు జరుగుతోంది. బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యుంది. ఇప్పటికే ఆప్ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియాతో పాటు మరికొందరిని సీబీఐ ఇప్పటికే విచారించింది. ఇదే కేసులో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) ఆరుగురిని అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో ఎమౌంట్ తక్కువే కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన మనుషులు బాగా హై ప్రొఫైల్ వాళ్ళు కాబట్టి కేసుకు ప్రాధాన్యతొచ్చింది.శరత్ చంద్రారెడ్డి, కవిత, మనీష్ శిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి తదితరులపైన బాగా ఆరోపణలు వినబడుతున్నాయి. వీరిలో ఇప్పటికే కవితను తప్ప మిగిలిన అందరినీ విచారించటంతో పాటు కొందరిని అరెస్టు కూడా చేసింది. ఫైనల్ గా కవితను విచారిస్తే కేసు విచారణ ఒక కొలిక్కి వస్తుందని సీబీఐ ఎప్పటినుండో అనుకుంటోంది. మొత్తానికి ఆదివారం కవితను ప్రశ్నించటానికి సీబీఐకి అవకాశం దక్కింది.తొందరలోనే రెండోసారి కూడా సీబీఐ విచారణ జరపటానికి ప్లాన్ చేసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. రెండోసారి విచారణ జరిగితే తర్వాత విచారణ ఢిల్లీలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ విచారణలో కవిత మీద సీబీఐ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయినా విచారణ వేదిక ఢిల్లీకి మారిన తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని అనుమానంగా ఉంది. ఈ నేపధ్యంలోనే కవిత విచారణపై అందరిలోను తీవ్ర ఉత్కంఠ పెరిగిపోతోంది. చివరకు సీబీఐ విచారణ ఎలా ముగుస్తుందో తెలీదుకానీ ఇప్పటికైతే టెన్షన్ పెంచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: