మండుసూ తుఫాన్ ఎఫెక్ట్: ఆ ప్రాంతాల పై ప్రభావం..

Satvika
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'మాండూస్' తుఫాను తన పరిధిని క్రమక్రమంగా పెంచుకుంటూ బలంగా తీరప్రాంతాలవైపు దూసుకొస్తోంది..గతంలో కురిసిన భారీ వర్షాలకు జనం ఇంకా భయంతో వణికిపోతున్నారు.గడిచిన ఆరు గంటల్లో దాదాపు 11 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాన్ ఈ రోజు ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ.. జాఫ్నా (శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ.. కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 460 కి.మీ.. చెన్నైకి ఆగ్నేయంగా 550 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మధ్య డిసెంబర్ 9 అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఇంకా పుదుచ్చేరి, శ్రీహరికోట వద్ద దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని 65 నుంచి 75 కి మీ గరిష్టంగా 85 కి మీ వేగంతో తుఫాను గాలులు వీచే అవకాశం ఉంటుంది.రానున్న మూడు రోజులు..
ఉత్తరాంద్ర,దక్షిణాంద్ర లో వర్ష ప్రభావం..

ఈ రోజు,రేపు, ఎల్లుండి లో ఒకటి లేక రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉత్తరాంద్రలో కురిసే అవకాశముంది.
ఇక దక్షిణాంద్రలో ఈ రోజు దక్షిణాంధ్రలోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి మీ గరిష్టం గా 60 కి మీ వేగంతో ఈదురు గాలులు వీయవచ్చు.

ఈ రోజు దక్షిణాంధ్రలోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ప్రకాశం, బాపట్ల జిల్లాలలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురవవచ్చు. ఈదురు గాలులు గంటకు 65 -75 కి మీ గరిష్టం గా 85 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది..
ఇక రాయలసీమ విషయాన్నికొస్తే.. కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తిరుపతి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ గరిష్టం గా 60 కి మీ వేగంతో వీయవచ్చు.

రేపు..కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. చిత్తూరు ,అన్నమయ్య జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 65 -75 కి మీ గరిష్టం గా 85 కి మీ వేగంతో వీయవచ్చుఎల్లుండి.. కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైస్సార్ కడప జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 55 -65 కి మీ గరిష్టం గా 75 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: