ఎల్ఐసీ స్కీమ్ లో ఆగిపోయిన అమౌంట్ ను ఎలా క్లైమ్ చేసుకోవాలంటే?

Satvika
చాలా మంది ఎల్ఐసీ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు.. వాటి లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు..అయితే కొన్ని కారణాల వల్ల ఎల్‌ఐసీలో డబ్బులు నిలిచిపోతాయి.అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ ఎల్‌ఐసీ అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. అయితే పాలసీ తీసుకున్న తర్వాత కొన్ని వాయిదాలు నిలిచిపోవడం తో డబ్బులు క్లెయిమ్‌ చేయడం నిలిచిపోతుంటాయి. అయితే నిలిచిపోయిన ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయలేరు. ఆ మొత్తం ఎంత, దానిని ఎలా పొందాలి తెలుసుకోండి.

క్లెయిమ్ చేయని మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఎల్‌ఐసీ తన వినియోగదారులకు సహాయం చేస్తుంది. దాని కోసం మీరు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో మీ నిలిచిపోయిన మొత్తం గురించి సులభంగా సమాచారాన్ని పొందవచ్చు. కానీ దాని కోసం మీరు పాలసీకి సంబంధించిన సరైన వివరాలను సమర్పించాలి. దాని కోసం మీరు ముందుగా ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ licindia.in కి వెళ్లాలి. అక్కడ మీరు పాలసీ నంబర్, పాలసీదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్ వివరాల ను నమోదు చేయాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆప్షన్‌ను ఎంచుకుని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

అనంతరం పూర్తి సమాచారాన్ని ఎల్‌ఐసీ కస్టమర్‌కు అందిస్తుంది. ఆ తర్వాత కింది దశలను పూర్తి చేసిన తర్వాత కస్టమర్ చెప్పిన మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండా మొత్తాన్ని విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు. ఎల్‌ఐసీలో బకాయి మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మీరు ముందుగా ఎల్‌ఐసీ హోమ్‌పేజీని సందర్శించాలి. మీరు ఈ వెబ్‌సైట్ దిగువన అన్‌క్లెయిమ్ చేయని అమౌంట్ లింక్‌ను గుర్తించాలి.. మీరు చెల్లించాల్సిన మొత్తం గురించి అక్కడ డిటైల్స్ అందుబాటులో ఉంటాయి.ఇక్కడ ఏదైనా సమస్య ఏర్పడితే దగ్గరలో ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్సించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: