ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..

Satvika
ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ భీమా కంపెనీ ఎల్ఐసీ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకోని వస్తుంది.. పదవీ విరమణ తర్వాత తర్వాత ఇంటి ఖర్చులను ఎలా మెయింటెన్ చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా.. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారికి పెన్షన్ కూడా రాదు.డబ్బు లేకుండా ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లలేరు. అందుకే ఎలాంటి టెన్షన్‌ లేకుండా ప్రతి నెలా మొదటి తేదీన నిర్ణీత మొత్తం వచ్చే చోట పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎల్‌ఐసికి చెందిన ప్రత్యేక పాలసీ గురించి తెలుసుకోండి. దీనివల్ల మీరు ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు..చాలా కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ నేటికీ చాలా మంది ప్రజలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని నమ్ముతారు. మీరు కూడా ఎల్‌ఐసి పాలసీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇందులో ఒకసారి పెట్టుబడి పెట్టాలి తర్వాత నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ లభిస్తుంది..పెన్షన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి..పెట్టుబడి పెట్టడానికి వయస్సు 75 సంవత్సరాలు. పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఏకమొత్తంలో రూ.6 లక్షల 10 వేల 800 ప్రీమియం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై సమ్ అష్యూర్డ్ మొత్తం రూ. 6 లక్షలు ఉంటుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారుడికి వార్షిక పెన్షన్ రూ.76 వేల 650 లభిస్తుంది. అర్ధ సంవత్సరపు పెన్షన్ రూ. 37 వేల 35 ఉంటుంది. త్రైమాసిక ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవాలనుకుంటే ప్రతి మూడు నెలలకు రూ.18 వేల 225 వస్తుంది.అదే సమయంలో నెలవారీ పెన్షన్ 6 వేల 08 రూపాయలు. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం 12000 రూపాయల పెన్షన్ హామీ ఇస్తారు. పెట్టుబడిదారుడికి జీవితాంతం అంటే అతని మరణం వరకు చెల్లిస్తారు. ప్రతి నెలా 20 వేల రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే ఒకేసారి 40 లక్షల 72 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది..లోన్ కూడా తీసుకోవచ్చు..మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: