కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. వారికి 3000 పెన్షన్?

Purushottham Vinay
దేశంలోని అన్ని వర్గాల వారికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రకాల మంచి పథకాలను తీసుకువస్తోంది. పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు పలు రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఇక అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం మోడీ ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.అసంఘటిత రంగ కార్మికులు కూడా తమ వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాను పొందేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పూర్తిగా స్వచ్ఛందంగా ఇంకా అలాగే మీకు ఆర్థికంగా సహకారం అందించే విధంగా ఉంటుంది. ఈ పథకం కింద కార్మికులు కనీసం రూ.3000 ఫిక్స్డ్ పెన్షన్ పొందవచ్చు. ఇక ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్ళు నిండినప్పుడు ఈ పెన్షన్ పొందవచ్చు. పథకం సమయంలో ఈ పెన్షనర్ కనుక మరణిస్తే అతని భార్య లేదా భర్త కుటుంబానికి పెన్షన్‌లో సగం మొత్తాన్ని పొందే సదుపాయం కూడా ఉంటుంది. అయితే కుటుంబ పెన్షన్ కేవలం జీవిత భాగస్వామికి అంటే భార్య లేదా భర్తకు మాత్రమే ఇవ్వబడుతుంది.ఇక అసంఘటిత రంగంలోని ఏ కార్మికుడైనా ఈ పథకానికి అర్హులు.


అయితే వారి నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అతని వయస్సు వచ్చేసి 18-40 సంవత్సరాలు ఉండాలి. ఇక అప్పుడే అతను ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ప్రయోజనం జాతీయ పెన్షన్ సిస్టమ్ ఇంకా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడు కానీ అదే కార్మికుడు లేదా ఉద్యోగికి లభించునుంది. అయితే మాన్ ధన్ యోజన ప్రయోజనం ఆదాయపు పన్ను చెల్లించని ఉద్యోగికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది.మాన్ ధన్ యోజన డబ్బు ఉద్యోగి బ్యాంక్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా నుండి ఆటో డెబిట్ ద్వారా జమ అవుతుంది. ఉద్యోగి తన ఖాతాను తెరిచినప్పుడు ప్రతి నెలా కూడా డిపాజిట్ చేయవలసిన డబ్బు అదే సమయంలో నిర్ణయించబడుతుంది. ఉద్యోగి 60 ఏళ్ల వయస్సు దాకా ఎలాంటి అంతరాయం లేకుండా ఈ డబ్బుని డిపాజిట్ చేయాలి. 60 సంవత్సరాల తర్వాత ఈ డిపాజిట్ ఆధారంగా పెన్షన్ ఇవ్వబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: