రైల్వే గుడ్ న్యూస్..బెర్త్ కంఫార్మ్ కాలేదా? ఇలా చేసుకోవచ్చు..

Satvika
రైలు ప్రయాణం చాలా సుకవంతమైన ప్రయాణం.. దాంతో అందరూ కూడా ఈ ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు.. అయితే, రైల్వేలు ఎంత రద్దీగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన రూట్లలో ప్రయాణం చేసేందుకు కొన్ని నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకోవాలి.. టికెట్ కన్ఫామ్ అవుతుందో తెలియక, బెర్త్ వస్తుందో లేదోననే టెన్షన్ ప్యాసింజర్లకు ఉంటుంది. సరిగ్గా చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో బెర్త్ కన్ఫామ్ కాదు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడంతో పాటు.. ఇతర క్లాసుల్లో కష్టంగా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అలాంటి వారి ఇబ్బందులు గమనించిన ట్రైన్ మ్యాన్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

రైల్వే ప్రయాణికులకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్ మ్యాన్ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యవసర సమయాల్లో ట్రైన్‌ టికెట్‌ బెర్తు కన్ఫామ్ కాని ప్యాసింజర్ల కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.టికెట్ కన్ఫామ్ కాని సమయంలో ప్రయాణీకులకు ఆ రూట్లలో విమాన సదుపాయం ఉంటే ఫ్రీగా ఫ్లైట్‌ టికెట్‌లు అందిస్తామని వెల్లడించింది. ట్రిప్ అస్యూరెన్స్ అనే కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేసింది. దీని ద్వారా రైల్వే ప్రయాణీకులకు సీట్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే వారికి టికెట్లను కన్ఫామ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చింది.


ప్రయాణీకుడు కన్ఫామ్ టికెట్లను పొందనట్లయితే, చార్ట్ తయారీకి ముందు టికెట్‌లు కన్ఫామ్ కాకపోతే.. ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్‌ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్‌ రూట్లు, టికెట్‌ సదుపాయాల్ని చూసి టిక్కెట్ ను బుక్ చెయ్యడానికి ఉపయోగ పడుతుంది..టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్‌లో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే.. యాప్ ట్రిప్ అస్యూరెన్స్ ఫీజు రూ.1 తీసుకుంటుంది. 90 శాతం కంటే తక్కువగా ఉంటే టికెట్ తరగతిని బట్టి ఛార్జీలు వసూలు చేస్తుంది..అలా టిక్కెట్ బుక్ కానీ వారికి ప్రత్యేక ఫ్లైట్ టిక్కెట్ లను అందిస్తున్నట్లు తెలిపింది..ఐఆర్‌సీటీ రాజధాని రైళ్లతో పాటు దాదాపు 130 ట్రైన్లలో ఈ సేవలను అందిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: