పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమికురాలి పేరుపై టీ కొట్టు పెట్టాడు?

praveen
ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఇక జీవితాంతం సరిపడిపోయే తీపి జ్ఞాపకాలు మిగులుతూ ఉంటాయి అని ప్రేమలో ఉన్నవారు చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కేవలం వట్టి మాటలు మాత్రమే నిజం కాదు అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఒక్కసారి ప్రేమలో పడి ఒకరికి మనసు ఇచ్చేసిన తర్వాత ప్రేమించిన వారిని మర్చిపోవడం మాత్రం అసాధ్యం అన్నది  ఎంతోమంది ప్రేమికులు చెప్పే మాట. ఇక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మొదటి ప్రేమ మాత్రం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అంటూ ఉంటారు.

 అయితే ప్రేమ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్రేమ అనేది మాత్రం కేవలం అవసరాలు తీర్చుకునే ఒక ఆయుధంగా మారిపోయింది. కొంతమంది ఏకంగా ప్రేమ పేరుతో మంచి వాళ్ళలా ముసుగులు వేసుకొని అవసరాలు తీర్చుకొని ఇక ప్రేమించిన వారిని మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. అంతేకాదు ప్రేమోన్మాధులు తమ ప్రేమను అంగీకరించలేదు అన్న కారణంతో దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.

 సాధారణంగా ప్రేమలో విఫలమైతే ఎంతో మంది అబ్బాయిలు పిచ్చి వాళ్ళలా మారిపోతారు. తాగుడుకు బానిసగా మారతారని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం అలా చేయలేదు. మధ్యప్రదేశ్ కు చెందిన అంతర్ అనే యువకుడు ఐదేళ్ల నుంచి ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి అతనితో పెళ్లికి నిరాకరించింది. వేరే అబ్బాయితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీంతో సదరు యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా తాను ప్రేమించిన అమ్మాయి పేరిట.. అమ్మాయి ఊరిలోనే  ఎం బేవఫా చాయ్ వాలా టీ కొట్టు అంటూ ఒక స్టాల్ పెట్టాడు. గతంలో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే తన పేరు పెట్టమని ప్రియురాలు చెప్పిందట. ఇక ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు సదరు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: