అమరావతి : లోకేష్ కెపాసిటి ఏమిటో తేలిపోతుందా ?

Vijaya
తెలుగుదేశంపార్టీకి పూర్వవైభవం సాధించటమే టార్గెట్ గా నారా లోకేష్ తొందరలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి నుండి కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర ఏడాదిపాటు సాగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. పాదయాత్రను ఏడాదిపాటు పెట్టుకున్నారంటేనే 2024 మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ముగిసేట్లుగా ప్లాన్ చేశారు. ప్లానింగ్ బాగానే ఉండచ్చుకానీ పార్టీకి పూర్వవైభవం తెచేంత కెపాసిటి లోకేష్ కు ఉందా అనేదే పెద్ద ప్రశ్న.ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకే దిక్కుతోచటంలేదు. కుదేలైపోయిన పార్టీని మళ్ళీ ఎలాగ పైకి లేపాలో అర్ధంకావటంలేదు. నూరుశాతం ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతున్నా పార్టీకి పాజిటివ్ ఇమేజి దక్కటంలేదు. ఒకవైపు తమ్ముళ్ళకు ఎంతచెప్పినా ఆందోళన కార్యక్రమాల్లో కనబడటంలేదు. ఈ కారణంవల్లే బాదుడేబాదుడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రదానకారణం ఏమిటంటే ఖర్చులకు భయపడే తమ్ముళ్ళెవరు పార్టీ కార్యక్రమాల్లో కనబడటంలేదు.ఇలాంటి సమయంలోనే లోకేష్ పాదయాత్రంటు హడావుడి చేస్తున్నారు. సరే ఇక లోకేష్ కెపాసిటి చూస్తే  తప్పులులేకుండా గట్టిగా పదిమాటలు కూడా మాట్లాడలేరు. తానేం మాట్లాడుతున్నాడో తనకే అర్ధంకాకుండా మాట్లాడుతాడు. లోకేష్ పాదయాత్ర పొడుగునా మీడియా కచ్చితంగా ఉంటుందనటంలో సందేహంలేదు. లోకేష్ దెబ్బకు పార్టీ ఇంకెంత నవ్వులపాలవుతుందో చూడాలి. ఒకసారి గతాన్ని గుర్తుచేసుకుంటే పిల్లనిచ్చిన మామగారు నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో అభ్యర్ధుల తరపున ప్రచారంచేశారు.అయితే ఆ ప్రచారంలో  బాలయ్య కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. దాంతో అభ్యర్ధులంతా గోలగోల చేసి బాలయ్య ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపించేశారు. జూనియర్ ఎన్టీయార్ కూడా టీడీపీకి 2009 ఎన్నికల్లో బాగా ప్రచారంచేశారు. మాటలు వరకు ఓకేనే కానీ ప్రభావం మాత్రం నిల్లు. అందుకనే బాలయ్య ప్రచారంచేసినా, జూనియర్ తిరిగినా టీడీపీ గెలవలేదు. మరి రేపటి ఎన్నికల్లో అభ్యర్ధులను గెలిపించేంత సీన్ లోకేష్ కు ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం 2019 ఎన్నికల్లో ఎలాగుందో కళ్ళకి కనబడుతోంది. అందుకనే అందరు లోకేష్ ను ఇపుడు జగన్ పాదయాత్రతో పోల్చుతున్నారు. సో లోకేష్ కెపాసిటి ఏమిటో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: