రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా చంద్రబాబు పోటీ... మీరేమంటారు తమ్ముళ్లు ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. అయితే గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించి 151 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుని పాలనలోకి వచ్చింది. ఇక అప్పటి నుండి టీడీపీలో భవిష్యత్తుపై భయం పట్టుకుంది. కాగా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎన్నో పధకాలను ప్రజలకు అందిస్తూ మహిళల ఆదరణను దక్కించుకున్నాడు. దీనితో ప్రతిపక్షములో ఉన్న చంద్రబాబు నాయుడుకి మనసులో గుబులు మొదలైంది.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కనుక టీడీపీ గెలవకుంటే ఇక చంద్రబాబు రాజకీయ జీవితానికి అదే ఆఖరి రోజు అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇక జగన్ సైతం చంద్రబాబును మళ్ళీ ఓడించి రాజకీయ సన్యాసం చేయించడానికి అవసరమైన మేరకు కష్టపడుతున్నాడు. కాగా తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబునాయుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం అధికారికంగా ఇంకా వెల్లడి కానప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికి కారణం కుప్పంలో వైసీపీ క్రమ క్రమంగా బలపడుతుండడమే... కుప్పంలో వైసీపీ ఎన్నడూ లేనంత ఉత్సాహంగా అడుగులు వేస్తోంది.. జగన్ కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి అవసరం అయిన అన్ని మార్గాలను వాడుకుంటూ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు.
అందుకే చంద్రబాబు లో రెండు చోట్ల పోటీ చేయాలన్న ఆలోచన కలిగింది. కుప్పం మరియు గుంటూరు 2 లేదా పెదకూరపాడు నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉందట. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను చెబుతున్నారట. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఎవరు ఎన్ని చేసినా.. గెలిచేది టీడీపీ అని , అనవసరంగా జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. మరి సీఎం జగన్ అనుకున్నట్లే చంద్రబాబును కుప్పంలో ఓడిస్తాడా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: