అమరావతి : చంద్రబాబుకు షాక్ కొట్టడం గ్యారెంటీనా ?

Vijaya





జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు షాక్ కొట్టడం గ్యారెంటీ అనే అనునామాలు పెరిగిపోతున్నాయి. విజయనగరం జిల్లాలోని గుంకలాం పర్యటన సందర్భంగా పవన్ మాట్లాడిన మాటలతోనే అందరిలోను సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ‘జగనన్న ఇళ్ళు లబ్దిదారుల కళ్ళల్లో కన్నీళ్ళు’ అనే కార్యక్రమాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ గుంకలాంలోని ఇళ్ళు నిర్మిస్తున్న ప్రాంతంలో తిరిగారు.




ఈ సందర్భంగా మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓట్లేసి గెలిపించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం, జనసేన ప్రభుత్వం రావటమూ ఖాయమని చెప్పారు. ఇంట్లోని పెద్దోళ్ళకు జనసేనకు ఓట్లేయాలని చెప్పాలని యువతకు పిలుపిచ్చారు. స్వచ్చమైన పరిపాలన ఎలాగుంటుందో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చూపిస్తానని పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నామినేషన్లను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.



పవన్ స్పీచ్ మొత్తంచూసిన తర్వాత కొన్ని సందేహాలు పెరిగిపోతున్నాయి. బీజేపీతోనే కలిసి జనసేన ఎన్నికలకు వెళుతుందా ? లేకపోతే టీడీపీతో పొత్తుపెట్టుకుంటుందా ? ఈ రెండూ కాకపోతే ఒంటరిపోరాటానికి పవన్ సిద్ధమవుతున్నారా ? అనే సందేహాలతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను అయోమయంలోకి నెట్టేశారు. బీజేపీతోనే పొత్తు కంటిన్యు అయ్యేట్లయితే మరి మిత్రపక్షం ప్రస్తావనను ఎందుకు తేలేదు ? 




ఒకవేళ తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకునేట్లయితే ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు ? పోనీ ఒంటరిపోరాటం చేద్దామని అనుకుంటే ఆ విషయాన్నయినా చెప్పాలికదా. పవన్ స్పీచ్ వల్ల ఇన్ని అయోమయాలు పెరిగిపోతున్నాయి. పోనీ గుంకలాంలో మాటకే చివరివరకు కట్టుబడుంటారా అంటే అదీ అనుమానమే. రేపు ఇంకోచోట ఇంకేం మాట్లాడుతారో పవన్ కే తెలీదు. ఇన్ని గందరగోళాల మధ్య ముందు షాక్ కొట్టేది చంద్రబాబుకే. బీజేపీకి జరిగే నష్టమేమీలేదు ఎందుకంటే ఆ పార్టీకి ఇపుడున్నదేమీ లేదుకాబట్టి. మొత్తానికి తన అజ్ఞానంతో పవన్ ఇటు బీజేపీ అటు చంద్రబాబును ఏకకాలంలో గందరగోళంలోకి నెట్టేస్తున్నదైతే ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: