వింత ఆచారం.. అక్కడ పిల్లలను కనడం నిషేధం?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే ఇంకా కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ఊబిలోనే కూరుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో ఉన్న కొన్ని విచిత్రమైన ఆచారాలు సాంప్రదాయాలు వెలుగులోకి వచ్చినప్పుడు అది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక వింత సాంప్రదాయం గురించిన వార్త వెలుగులోకి వచ్చి అందరిని అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా భార్యాభర్తలు దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక పిల్లలను కనాలని ఎంతో ఆశ పడుతూ ఉంటారు.

 ఇక తమ జీవితంలోకి పిల్లలు వస్తే ఇక జీవితం మరింత ఆనందంగా మారిపోతుందని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే అందరికీ తెలిసినంతవరకు ఇక ఎక్కడైనా సరే భార్యాభర్తలు పిల్లలు కనడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు.. ఏకంగా ఆ గ్రామంలో పిల్లలను కనడం పైనే నిషేధం కొనసాగుతూ ఉంటుంది. అదేంటి పిల్లలు కనడం మీద నిషేధం ఉండడమేంటి.. ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. నిజం గానే విచిత్రమైన సాంప్రదాయం అక్కడ అందరూ పాటిస్తూ ఉన్నారు.

 ఇంతకీ ఇది ఎక్కడో కాదు.. మధ్యప్రదేశ్ లోని సంకర్యామ్ గ్రామం లో. అక్కడ ఎవరైనా సరే పిల్లలను కనడం నిషేధం. ఇక ఎవరైనా గర్భం దాల్చితే ఊరి పొలి మేరలో లేదా వేరే ఊరికి వెళ్లి పిల్లలను కనాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఊరి పెద్దలు పెద్దగా పట్టించుకోరు.. ఇక పొరపాటున గ్రామం లో పురుడు పోసుకుంటే మాత్రం శిశువు తప్పకుండా మరణిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఇప్పటికీ కూడా ఆ గ్రామం లో చిన్న ఆసుపత్రికి కూడా లేకపోవడం గమనార్హం. ఈ వింత ఆచారం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: