కేసీఆర్ ను కూల్చే సత్తా మోదీకి ఉందా ?

VAMSI
ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్నాడు. ఈ సందర్భంగా మరోసారి తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ తెరాస పై కీలక వ్యాఖ్యలు చేశాడు. డైరెక్ట్ గా కేసీఆర్ ను అనకపోయినా, తన పార్టీని అంటే తనను అన్నట్టే. మోదీ మాటమాటమీద తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతాము అని షాక్ ఇచ్చారు. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు కదా.. కనీసం పోటీ ఇస్తుందా అన్నది తమకు తాము ప్రశ్నించుకోవాలి. మరోవైపు ఈ వ్యాఖ్యల పట్ల రాజకీయ విశ్లేషకులు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. రాజకీయాలలో మాములుగా ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకోవడం పరిపాటి.
అయితే ఇలా మోదీ మాత్రమే కాకుండా కేసీఆర్ ప్రభుత్వంపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో అమిత్ షా సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ స్థానిక పార్టీగా ఎంతో బలమైన, ప్రజల బలం కలిగిన తెరాసను వచ్చే ఎన్నికల్లో ఓడించడం అంత సులభమా ? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రెండు పర్యాయాలుగా కేసీఆర్ తెరాస ను దగ్గరుండి మరీ గెలిపించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎక్కువ శాతం నెరవేర్చుతున్నారు. ఆలా ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై పాజిటివ్ స్పందన ఉంది. కానీ మోదీ ఇలా గట్టిగా పదే పదే ప్రభుత్వాన్ని పడగొడతాము అంటున్నారంటే బీజేపీ ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్లుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దీనిని బట్టి బీజేపీ వచ్చే ఎన్నికల సమయానికి తెలంగాణను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి ప్రత్యర్థులను దెబ్బ కొట్టి అధికారంలోకి వచ్చే అలవాటున్న బీజేపీ.. తెలంగాణలోనూ అదే సూత్రాన్ని పాటిస్తుందా చూడాలి. అయితే కేసీఆర్ లాంటి నాయకుడి నేతృత్వంలో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతున్న తెరాసను మోదీ అండ్ కో పడగొట్టగలదా అన్నది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: