లోకేష్ పాదయాత్రతో "టీడీపీ దశ - దిశ" మారుతుందా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024 లో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలో ఎలాగైనా గెలుపును సాధించడానికి ఇప్పటి నుండే అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఒక పార్టీ తమ బలం ఏమిటో వెతుక్కునే పనిలో పడితే , మరో పార్టీ ప్రత్యర్థుల బలహీనతలను వెతుకుని వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి దారులను వెతుక్కుంటున్నారు. ఇక ఎంతో రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ పార్టీ టీడీపీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడడంతో అధినేత నారా చంద్రబాబు నాయుడు కంగారు పడుతున్నారు.
గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ సీఎం జగనా మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజలను నేరుగా కలిసి వారి కష్టనష్టాలను మరియు సమస్యలను తెలుసుకుని ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చి సీఎం లుగా ఎన్నిక అయ్యారు. అయితే ఇపుడు అదే పద్దతిని టీడీపీ కాపీ కొట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఈ మే నెలలో జరిగిన మహానాడు లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. కానీ మొదటగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తారని ప్రకటించినా, ఆయన ఆరోగ్య దృష్ట్యా లోకేష్ ఆ బాధ్యతను తీసుకున్నారు.
ఇక తాజాగా లోకేష్ తన పాదయాత్ర గురించిన వివరాలను తెలియచేశారు. వచ్చే జనవరి 27 వ తేదీన కుప్పం నియోజకవర్గం నుండి పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర గురించి అధికార పార్టీలో పెద్దగా చర్చ కానీ, లేదా దీని గురించి సీరియస్ గా తీసుకున్నట్లు కానీ కనిపించడం లేదు. పాదయాత్రల వలన ఎలాంటి పెనుమార్పులు అయినా జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళని రీచ్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది. మరి రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ లలాగా లోకేష్ ను కూడా ప్రజలు ఆదరిస్తారా ? ఈ పాదయాత్ర వలన టీడీపీ దశ దిశ మారుతుందా అన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: