ఎల్ఐసీలో అద్భుతమైన ప్లాన్..రూ.48 లక్షలు పొందే అవకాశం..

Satvika
ప్రముఖ ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసి పాలసీదారులకు కొత్త కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకోని వస్తుంది.ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్నీ కూడా మంచి లాభాలను అందిస్తున్నాయి..పొదుపు చెయ్యాలని భావిస్తున్నవారికి మాత్రం లక్షలు పొందే బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.వినియోగదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా పథకాలు అమలు చేస్తోంది. తక్కువలో తక్కువగా నెలకు రూ. 500 తోనూ పెట్టుబడి అవకాశాలను అందిస్తోంది. ఇప్పుడు మేం చెబుతున్న స్కీమ్‌ ఇంకా కొత్తది. మీరు ప్రతి రోజూ రూ. 74 కంటే తక్కువ ఆదా చేసినా, లేదా పెట్టుబడిగా పెట్టినా నిర్దిష్ట కాల పరిమితి తర్వాత భారీ మొత్తంలో రాబడి పొందే కొత్త పథకాన్ని lic తీసుకొచ్చింది..

ఎండోమెంట్‌ పాలసీ. సాధారణ బీమా పాలసీల కంటే కాస్త భిన్నంగా, బీమా కవరేజీ, సేవింగ్స్ ప్లాన్ రెండింటినీ ఇది మీకు అందిస్తుంది. అన్ని పథకాల్లాగే దీని మీదా ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే... నిర్దిష్ట కాల వ్యవధి వరకు క్రమం తప్పకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ వెళ్లవచ్చు. lic తీసుకు వచ్చిన ఈ కొత్త ఎండోమెంట్‌ పాలసీ ఒక నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత బీమా పథకం. పాలసీ మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు ఒకేసారి పేద్ద మొత్తాన్ని పొందవచ్చు. ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగి పాలసీదారు మరణిస్తే, ఆ కుటుంబానికి డబ్బు అందుతుంది.. పాలసీ మీద రుణం కూడా తీసుకోవచ్చు. అనుకోని ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు..పాలసీని తీసుకోవాలంటే కనీస వయస్సు 8 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు. 8 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు - 75 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లు పాలసీలో ప్రవేశించడానికి అనర్హులు.

పాలసీ కోసం కనిష్టంగా 12 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది.ఒక లక్ష రూపాయల బీమా కవరేజీ కోసం 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటే... 15 ఏళ్ల పాలసీ టర్మ్‌ కోసం ఏడాదికి కనీసం రూ. 6,978 ప్రీమియం కట్టాలి. 25 ఏళ్ల పాలసీ టర్మ్‌ కోసం ఏడాదికి కనీసం రూ. 3,930 ప్రీమియం చెల్లించాలి. 35 ఏళ్ల పాలసీ టర్మ్‌ తీసుకుంటే, వార్షిక కనీస ప్రీమియం 2,754 రూపాయలు. మీ పిల్లల వయస్సు 8 లేదా 9 సంవత్సరాల అయితే వాళ్ల పేరు మీదే బీమా కవరేజీ పొందవచ్చు.మీకు ఇంట్రెస్ట్ వుంటే ఈ పథకంలో జాయిన్ అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: