ఏపీలో ప్రధాని మోదీ సపోర్ట్ జగన్ కా ? చంద్రబాబుకా ?

VAMSI
ఏపీలో యువ నాయకుడు సీఎంగా మారి అద్భుతమైన పాలనను అందిస్తున్నారన్నది బయట రాష్ట్రాల్లో వినిపిస్తున్న టాక్, ఇందుకు రుజువులే కొన్ని పధకాలను మరియు సంక్షేమ కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు ఆచరణలోకి తీసుకు రావడం. ఇక జగన్ ఎన్నికల ముందు తీసుకువచ్చిన మ్యానిఫెస్టోను సైతం దాదాపుగా నెరవేర్చారన్నది తెలుస్తున్న విషయం. కానీ ఇటీవల దేశంలో సీఎం ల పనితీరు గురించి జరిగిన ఒక సర్వే లో జగన్ కు నాలుగవ స్థానం వచ్చిందట. ఈ సర్వే ముఖ్యంగా పధకాలు మరియు పాలన మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ర్యాంకు ను బట్టి జగన్ కు ప్రజల్లో అభిమానం మరియు ఆదరణ తగ్గిదని కొందరు ప్రచారం చేస్తున్నారు.
కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారట. బీజేపీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాల మీద ఏపీ మీద ఫోకస్ పెట్టారట. అంతే కాకుండా ఇంతకు ముందు వరకు జగన్ పాలనపై పాజిటివ్ స్పందన రాగా.. ఇప్పుడు ఏంటి ఏకంగా నాలుగవ స్థానానికి పడిపోయాడంటూ ఆలోచనలో పడ్డారట. దీనితో ఏపీలో వచ్చే ఎన్నికలకు ఎవరికీ సపోర్ట్ చేయాలన్న విషయంపై కూడా వర్క్ అవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికప్పుడు చంద్రబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ సమయంలో జగన్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. అదే విధంగా అంతకు ముందు ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు అండగా నిలబడి టీడీపీ గెలుపులో సపోర్ట్ చేశారు.
కానీ ఈ సారి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండడం బీజేపీకి చాలా అవసరం అని మోదీ భావిస్తున్నారు . ఇప్పుడు ఎన్నికల ముందు వరకు ప్రజలు నాడిని బట్టి తమ సపోర్ట్ ఉంటుందని క్లియర్ గా అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: