బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్ సారూ..

Satvika
ఒకప్పుడు మద్యం మగవాళ్ళకు మాత్రమే సొంతం.. అందుకే గొడవలు కూడా ఎక్కువగా ఉండేవి..ఈ మధ్య కాలంలో గొడవలు పూర్తిగా తగ్గిపోయాయి.. అందుకు కారణం కూడా లేకపోలేదు..ఈరోజుల్లో ఆడ,మగ సమానం అని ఆడవాళ్ళు కూడా మగవారితో పోటీ పడి తాగుతున్నారు.తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.హన్మకొండలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మద్యం సేవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఆసుపత్రికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల మహిళలు చికిత్స కోసం వస్తుంటారు.

ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చర్చనీయాంశం అయింది. స్టాఫ్‌రూమ్‌లో మహిళా సిబ్బంది బీర్లు తాగుతూ హల్ చల్ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీర్లు తాగుతూ సిబ్బంది హంగామా చేశారు. మద్యం పార్టీలో ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్, జీఎన్‌ఎమ్ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారంపై చికిత్స కోసం వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది బయట నుంచి మరో ఇద్దరు మహిళలను పిలిచి ఆసుపత్రిలో బీర్ పార్టీ చేసుకున్నారు. బుధవారం రాత్రి పుట్టినరోజు వేడుకల పేరిట ఓ గదిలో వైద్య ఆరోగ్య సిబ్బంది మందు పార్టీ చేసుకున్నారు. మందు పార్టీ దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇలా బాధ్యత రహితంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ ఉన్నతాధికారుల కార్యాలయాలకు సమీపంలో ఈ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఉంది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి..ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: