హైదరాబాద్ : మును’గోడు’లో మోడీయే మైనస్సా ?

Vijaya






మునుగోడు అసెంబ్లీఉపఎన్నికలో నరేంద్రమోడీ తీసుకున్ననిర్ణయమే బీజేపీ కొంపముంచేయబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజాగా చేనేతపై జీఎస్టీ విధిస్తు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేతరంగంపై జీఎస్టీ విధించవద్దని చాలామంది మొత్తుకున్నా మోడీ పట్టించుకోలేదు. అసలే చేనేతరంగం అంతంతమాత్రంగా ఉన్న పరిస్దితుల్లో జీఎస్టీ విధిస్తే మరింత ఇబ్బంది పడుతుందని మేధావులు, చేనేత సామాజికవర్గం పెద్దలు చెప్పినా మోడీ వినిపించకోలేదు.



ఇపుడిదే అంశం మునుగోడులో బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నియోజకవకర్గంలోని 2.41 లక్షల ఓటర్లలో బీసీలు చాలా ఎక్కువ. బీసీల్లోని సామాజికవర్గాల ఓటింగ్ శాతం సుమారు 60 శాతం ఉంటుంది. ఇందులో పద్మశాలీల సంఖ్య సుమారుగా 12 వేలుంటుంది. కేంద్రప్రభుత్వం చేనేతలపై జీఎస్టీ విధించిన ప్రభావం మునుగోడులోని 12 వేల మందిపైనా పడుతుంది.



సరిగ్గా ఉపఎన్నికల సమయంలోనే నరేంద్రమోడీ ప్రభుత్వం జీఎస్టీ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగానే రాపోలు ఆనందభాస్కర్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. రాపోలు గతంలో కాంగ్రెస్ నుండి రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. అయితే రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ కు రాజీనామాచేసి బీజేపీలో చేరారు. ఇపుడు చేనేత వర్గానికే చెందిన రాపోలు కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.



ఇపుడు ఉపఎన్నికలో గెలుపు నీదా నాదా అని టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఏమిటో పాపం ఆ పార్టీ అభ్యర్ధికే తెలియటంలేదు. టైట్ పోటీ జరుగుతున్న ఉపఎన్నికల్లో వంద ఓట్లు కూడా అత్యంత కీలకమనే చెప్పాలి. ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకున్న చేనేతలపై జీఎస్టీ నిర్ణయంతో నియోజకవర్గంలోని చేనేతలంతా వ్యతిరేకమైతే బీజేపీకి పెద్ద దెబ్బనే చెప్పాలి.  చేనేతల ఓట్లు 12 వేలంటే మామూలు విషయం కాదుకదా.  బీజేపీ అభ్యర్ధి రాజగోపాలరెడ్డి ఎంతమొత్తుకుంటే మాత్రం ఏమిటి ఉపయోగం ? ఏకంగా ఒకవర్గమంతా వ్యతిరేకమైపోయిన తర్వాత ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: