అమరావతి : ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కేలేదా ?

Vijaya







వచ్చే ఎన్నికలు చంద్రబాబునాయుడుకు జీవన్మరణ సమస్య లాంటిది. ఏపీలో  తెలుగుదేశంపార్టీ గెలవకపోతే తెలంగాణాలో పార్టీ పరిస్ధితి లాగే తయారైపోతుంది. ఇప్పటికే పార్టీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్న విషయం అందరు చూస్తున్నదే. ఈ నేపద్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన చంద్రబాబు అచ్చంగా ఎల్లోమీడియాపైన మాత్రమే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. దాంతో పార్టీ పరిస్ధితిలో ఎలాంటి మార్పు కనబడటంలేదు.



ఇక్కడ సమస్య ఏమిటంటే పార్టీకి 43 నియోజకవర్గాల్లో దిక్కేలేకుండాపోయింది. పార్టీ పరిస్ధితి ఎంత అన్యాయంగా ఉందంటే నాలుగుజిల్లాల్లో పార్టీకి ఇపుడు ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు. నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు మొత్తం 10 నియోజకవర్గాలు వైసీపీనే గెలుచుకుంది. కర్నూలులోని 14 నియోజకవర్గాలో ఎక్కడా టీడీపీ గెలవలేదు. ఇక కడపలోని పదికి పది నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది సున్నా. అలాగే విజయనగరం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు తొమ్మిదింటిలో వైసీపీనే గెలిచింది.



నాలుగుజిల్లాల్లో ఒక్క ఎంఎల్ఏ కూడా లేకపోవటం టీడీపీకి చాలా పెద్దదెబ్బనే చెప్పాలి. మరి పై జిల్లాల్లో పుంజుకునేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను వైసీపీనే గెలవాలని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారంటే అర్ధముంది. ఎందుకంటే ఇపుడు పార్టీకి 151 నియోజకవర్గాలున్నాయి కాబట్టి మరో 24 నియోజకవర్గాలు సాధించుకుంటే జగన్ కోరిక తీరుతుంది. ఇదే సమయంలో టీడీపీ 160 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చంద్రబాబు ఎలా చెబుతున్నారు ? అసలిది సాద్యమేనా ? పై జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఏమి చర్యలు తీసుకున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. 




ముందు పై 4 జిల్లాల్లో ఎన్నిసీట్లు గెలుచుకుంటుందో చంద్రబాబు లెక్కలు వేసుకుంటే ఆ తర్వాత 160 సీట్లు గెలుచుకుంటుందా లేదా అన్నది మళ్ళీ ఆలోచించుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గరనుండి పార్టీ పుంజుకున్న దాఖలాలు ఏమీ కనబడటంలేదు. మరిలాంటి పరిస్ధితిలో 160 నియోజకవర్గాల్లో గెలుపు గ్యారెంటీ అంటే పెద్ద జోక్ గా మిగిలిపోవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: