ఏపీకి రెయిన్ అలర్ట్..మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Satvika
ఇప్పుడు ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలుసు.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు లొతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్క్కొవడం జరిగింది.ఉత్తర అండమాన్ సముద్రం, చుట్టుపక్కల పరిసరాల్లో ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది..అక్టోబర్ 20 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య, ఆనుకుని నైరుతి బంగాళాఖాతం లో అల్పపీడనంగా బలపడనున్నట్లు ఆ సంస్థ ఎండీ డా.బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. దీంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే కోస్తా, రాయలసీమ లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి అనగా సోమవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

మంగళవారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.వర్షాలు నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ప్రవహించే అవకాశం ఉన్నందున నదీపరీవాహక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, లోతట్టు ప్రాంతప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: