హైదరాబాద్ : అంతా కలిసి రాజగోపాల్ ను తరిమేశారా ?

Vijaya






మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి చుక్కలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరినందుకు ఇపుడు ఫలితం అనుభవిస్తున్నట్లున్నారు. అంతిమంగా ఫలితం ఎలాగుంటుందో తెలీదుకానీ ఇపుడు మాత్రం కొన్ని గ్రామాల్లో ప్రచారానికే రానీయటంలేదు. చౌటుప్పల్ మండలంలోని అల్లవరం గ్రామంలో ప్రచారానికి వచ్చిన రాజగోపాల్ ను గ్రామస్తులంతా కలిసి తరిమేశారు.



తమ గ్రామంలో రాజగోపాల్ అసలు ప్రచారానికే రావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. 2018 ఎన్నికల్లో తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కాంట్రాక్టులకు అమ్ముడుబోతావా అంటు మండిపడ్డారు. తమ ఓట్లను రాజగోపాల్ రు. 18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులకు అమ్ముకుంటావా అంటు గోల గోల చేశారు. వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులకు అమ్ముడుబోయిన రాజగోపాల్ కు ఎన్నికల్లో పాల్గొనే అర్హతే లేదంటు గ్రామస్తులు మొహంమీదే చెప్పేశారు. ఇప్పటికే ఐదుగ్రామాల్లో రాజగోపాలరెడ్డిని అసలు ప్రచారం చేసుకోవటానికి అనుమతించలేదు జనాలు. 



గ్రామస్తులను కన్వీన్స్ చేయటానికి అభ్యర్ధి ఎంత ప్రయత్నించినా జనాలు వినిపించుకోలేదు. దాంతో చేసేదిలేక ఆ గ్రామంలో ప్రచారం చేయకుండానే వెళిపోయారు. ప్రచారం చేసుకోనీయకుండా రాజగోపాల్ ను అడ్డుకున్న మొదటి గ్రామం కాదు అల్లవరం. ఇప్పటికే నాలుగైదు గ్రామాల జనాలు ప్రచారం చేసుకునేందుకు రాజగోపాల్ కు అవకాశం ఇవ్వలేదు. గ్రామంనుండి వెళిపోయేంతవరకు ఊరుకోలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే బీజేపీ నేతలకు మతిపోతోంది.



నియోజకవర్గంలో బీజేపీకి అంటు ప్రత్యేకంగా పట్టులేదు. రాజగోపాల్ బలమే పార్టీ బలం. అలాంటిది అభ్యర్ధినే ప్రచారం చేసుకోనీయకుండా కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటుంటే ఇక ప్రచారానికి వెళ్ళిన మిగిలిన నేతల పరిస్ధితి ఏమిటి ? రాజగోపాల్ ప్రచారాన్ని అడ్డుకోవటంలో ఒక పాయింటుంది. అదేమిటంటే 2018 ఎన్నికల్లో అధికారంతో సంబంధంలేకుండా సొంతనిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ హామీలిచ్చారు. దాన్ని నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయితే రాజగోపాల్ గ్రామాల్లోకి అడుగుపెట్టింది మళ్ళీ ఇపుడే. అందుకనే మండిపోతు చుక్కలు చూపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: