పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..ఈ నిబంధనలను తప్పక తెలుసుకోవాలి..

Satvika
బెస్ట్ ప్రభుత్వ పథకాలలో పోస్టాఫీస్ పథకాలు ఒకటి..ఇందులో ఎన్నో పొదుపు పథకాలు వున్నాయి.. ఇక్కడ డబ్బులను పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందడం తో పాటు డబ్బులు సేఫ్ గా ఉంటాయి..అయితే, పోస్టాఫీసు ఖాతాదారు లు కొన్ని విషయాలని తెలుసుకోవాలి. అప్పుడే సమయం వృథా కాకుండా ఉంటుంది. ఇప్పుడు పోస్టాఫీసు ఖాతా నుంచి 10 వేల రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే లేదా ఎవరికైనా బదిలీ చేయాలనుకుంటే ప్రత్యేక వెరిఫికేషన్‌ చేయవలసి ఉంటుంది..

అప్పుడు మాత్రమే 10 వేల రూపాయల లావాదేవీ జరుగుతుంది. లేదంటే అంతే సంగతులు.మీరు పోస్టాఫీసు పొదుపు ఖాతా నుంచి రోజూ డబ్బును తీసుకోవచ్చు. అయితే రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ విత్‌ డ్రా సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేశారు. ఈ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్టు 25న కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో కస్టమర్ రూ.10,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలంటే ప్రత్యేక ధృవీకరణ అవసరం అని తెలిపారు..సింగిల్ హ్యాండ్ పోస్టాఫీసుల్లో ఎక్కువ విత్‌డ్రాలకి వెరిఫికేషన్ ప్రక్రియను రద్దు చేశారు. ఇది కాకుండా కొన్ని షరతులలో పోస్టాఫీసు ద్వారా లావాదేవీలను తనిఖీ చేయవచ్చు. పోస్టాఫీసులో బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చారు. ఇలా చెయ్యడం ప్రజలు కూడా మోసాల బారిన పడకుండా కాపాడవచ్చు. ధృవీకరణ కోసం మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్‌ను ఖాతాకు లింక్ చేయడం ముఖ్యం.పోస్టాఫీసు విత్‌డ్రా పరిమితిని కూడా పెంచింది. ఇంతకుముందు ఖాతాదారులు రూ.5000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని రూ.20వేలకు పెంచారు. అయితే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఏ కస్టమర్ ఖాతాలోనికైనా 50 వేల రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలను అంగీకరించరు. దేశంలోని ఏ పౌరుడైనా పోస్టాఫీసులో తన ఖాతాను సులభంగా తెరవవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: