అమరావతి : మంత్రుల్లో వీళ్ళ స్టైలే వేరుగా వుందే ?

Vijaya


అసలే ప్రభుత్వ ఆర్ధికపరిస్దితి అంతంమాత్రంగా ఉంది. అనుకున్నంతగా ఆదాయాలు పెంచుకోవటం ప్రభుత్వంవల్ల కావటంలేదు. అవసరాలకు తగ్గట్లుగా నిధులు ఖర్చు చేయటమైతే తప్పదు. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయాలు పెంచుకోవటం ఒకమార్గం. రెండో మార్గం ఏమిటంటే ఖర్చులను తగ్గించుకోవటం. మనం అనుకున్నట్లుగా ఆదాయాలను పెంచుకోవటం సాధ్యంకాదు కాబట్టి ఖర్చులను తగ్గించుకోవటమే ఉత్తమం. ఇప్పుడిదంతా ఎందుకంటే ఆదాయాలను పెంచే విషయం పక్కనపెట్టేస్తే ఖర్చులు చేయటంలో మాత్రం మంత్రులు పోటీలు పడుతున్నారు.ప్రతిమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం ప్రతినెలా  ప్రభుత్వం చేయాల్సిన ఖర్చులు చాలానే ఉంటుంది. అదిసరిపోదన్నట్లుగా ఇద్దరు మంత్రుల వల్ల ప్రభుత్వానికి చేతిచమురు బాగా వదులుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ వల్ల ప్రభుత్వానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీళ్ళిద్దరు చెరో మూడు ఆఫీసులను మైన్ టైన్ చేస్తున్నారట. సచివాలయంలో ఉండే ఛాంబర్ కాకుండా ప్రత్యేకంగా క్యాంపాఫీసు పెట్టుకున్నారట.ఇదికూడా సరిపోదన్నట్లు ఏపీఐఐసీ కార్యాలయంలో మూడో ఆఫీసుంది. ఏ మంత్రికైనా సచివాలయంలో ఆఫీసు తప్పదు. ఇక అధికారిక నివాసాన్నే క్యాంపాఫీసంటారు. ఆఫీసు, ఇల్లు ఒకటే కాబట్టి ప్రత్యేకంగా అయ్యేఖర్చు కూడా ఏముండదు. అలాకాకుండా ఇంటికి సంబంధంలేకుండా ప్రత్యేకంగా క్యాంపాఫీసంటే మాత్రం భారీగానే ఖర్చవుతుంది. ఇదికూడా సరిపోదన్నట్లు ఏపీఐఐసీ కార్యాలయంలో మూడో ఆఫీసొకటి. క్యాంపాఫీసు, మూడో ఆఫీసు ఖర్చులు నిజంగానే దండగమారి ఖర్చులనే చెప్పాలి.  తమ హంగు, ఆర్బాటం ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం డబ్బును వృధా చేస్తున్నారు.
ఒక మంత్రికి మూడు ఆపీసులుంటే అవసరమైన జనాలు సదరు మంత్రిని కలవాలంటే ఏ ఆఫీసుకు వెళ్ళాలి ? సచివాలయం ఆపీసును మినహాయిస్తే మిగిలిన రెండు ఆఫీసుల నిర్వహణకు ప్రభుత్వం నెలకు చేసే ఖర్చంతా వృధానే కదా. వీళ్ళ వరస ఇలాగుంటే చాలామంది మంత్రులు సచివాలయంకు రావటమే అరుదనే ఆరోపణలున్నాయి. అందరు మంత్రులు వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా సచివాలయంలో ఉండాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా చాలామంది పట్టించుకోవటంలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: