అమరావతి : సీనియర్లకు చంద్రబాబు షాకిచ్చారా ?

Vijaya
ఫ్యామిలీ ప్యాకుల విషయంలో చంద్రబాబునాయుడు సీనియర్లలో చాలామందికి పెద్ద షాకే ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకుల రూపంలో అసెంబ్లీ టికెట్లు లేదా ఎంపీ+అసెంబ్లీ టికెట్ల కోసం చంద్రబాబు ముందు తమ డిమాండ్లను ఉంచారట. అయితే రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకమైనది కాబట్టి టికెట్ల కేటాయింపులో తానొక ఫార్ముల ప్రకారమే డిసైడ్ చేస్తానని స్పష్టంగా చెప్పేశారట.చంద్రబాబు ముందున్న డిమాండ్లను బట్టి చంద్రబాబు చెప్పిన దాన్నిబట్టి సుమారుగా 10 మంది సీనియర్లు ఫ్యామిలీప్యాకుల రూపంలో టికెట్లు ఇవ్వాలని అడిగారట. అనంతపురంలో జేసీ బ్రదర్స్, పరిటాల ఫ్యామిలీ గట్టిగా పట్టుబడుతున్నారట. పరిటాల కుటుంబంలో సునీత, శ్రీరామ్ ఇద్దరికీ టికెట్లు కావాలన్నారట. అలాగే జేసీ బ్రదర్స్ కూడా వారసులకి రెడు, మద్దతుదారులకు రెండు టికెట్లడిగారట. ఇక విశాఖపట్నంలో చింతకాయల కుటుంబం కూడా రెండు టికెట్లు అడుగుతున్నారట. చాలామంది సీనియర్లు ఎలాగైనా ఒకటికి మించి టికెట్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కేఈ, భూమా కుటుంబాలు  రెండేసి టికెట్లు అడుగుతున్నాయట. గోదావరి జిల్లాలో కూడా ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డిశ్రీనివాస్ తమకు రెండు టికెట్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారట. విజయనగరంలో కళావెంకటరావు కూడా రెండు టికెట్లు అడిగారని ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం 10 కుటుంబాలు రెండు టికెట్లచొప్పున పట్టుబడుతున్నాయి. అయితే ఇలాంటి కుటుంబాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడుకి మాత్రమే మినహాయింపు ఉంది.సో ఈ పద్దతిలో టికెట్లు అడుగుతున్న సీనియర్లందరికీ చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారట. ఫ్యామిలీకి కేవలం ఒక్క టికెట్ మాత్రమే ఇస్తానని ఎవరు పోటీచేయాలో మీరే నిర్ణయించుకోవాలని చెప్పేశారట. టికెట్ల కోసం తనపై ఒత్తిడి పెట్టవద్దని తాను ఫైనల్ చేసిన వాళ్ళే పోటీచేస్తారని కూడా తేల్చి చెప్పేశారట. దాంతో ఎవరు పోటీచేయాలో ఇపుడు సీనియర్లు, వాళ్ళ వారసులే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకులు లేవని గట్టిగా చెప్పటం ఓకేనే కానీ చివరివరకు చంద్రబాబు గట్టిగా ఉంటారా అనేదే అనుమానం.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: