అమరావతి : జూనియర్ పై టీడీపీ కసి తీర్చుకుంటోందా ?

Vijaya


తెలుగుదేశంపార్టీ అనుకున్నదొకటైతే జరిగిందొకటి అయ్యింది. దాంతో తమ ఉక్రోషాన్ని తట్టుకోలేక మూకుమ్మడిగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీయార్ పై రెచ్చిపోతున్నారు. తాత ఎన్టీయార్ కే జూనియర్ వెన్నుపోటు పొడిచారంటు మరీ నానా రచ్చ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే హెల్త్ యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరు మార్చి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది ప్రభుత్వం. యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరుమార్చటాన్ని చంద్రబాబునాయుడు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై ఎల్లోమీడియా కూడా జగన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోతోంది.సరే ఇదేదో రాజకీయంగా రేగిన రచ్చకాబట్టి వైసీపీ-టీడీపీ మధ్య గొడవని అనుకుంటే ఒక పద్దతిగా ఉండేది. కానీ తమ్ముళ్ళు అలా అనుకోకుండా మధ్యలో జూనియర్ ఎన్టీయార్ ను రచ్చలోకి లాగారు. ప్రభుత్వ వైఖరిపై జూనియర్ స్పందించాల్సిందే అని పదే పదే డిమాండ్లు చేశారు. దాంతో జూనియర్ స్పందిస్తు కర్రవిరక్కుండా పాము చావకుండా అన్నట్లు మొక్కుబడిగా ఒక ట్వీట్ పడేశారు. అందులోకూడా ప్రజాధరణలో  ఎన్టీయార్-వైఎస్సార్ ఇద్దరు గొప్పోళ్ళే అన్నారు. దాంతో తమ్ముళ్ళు బాగా రెచ్చిపోతున్నారు.ఇంతకీ తమ్ముళ్ళ కోపం ఏమిటంటే ప్రభుత్వాన్ని జూనియర్ అమ్మనాబూతులు తిట్టాలని ఆశించారు. తన అభిమానులందరినీ జగన్ పైకి రెచ్చగొడతారని అంచనాలు వేసుకున్నారు. తాము ఆశించినట్లు ట్వీట్ లేకపోవటంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలే అమిత్ షా తో భేటీ అయిన కారణంగా ఎల్లోబ్యాచ్ మొత్తం జూనియర్ అంటే మండిపోతోంది. అప్పుడేం మాట్లాడలేకపోయారు. ఇపుడు అవకాశం వచ్చిందికదాని రెచ్చిపోయి జూనియర్ పై తమ కసినంతా తీర్చుకుంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే తాను అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీయార్ ఆరోగ్యశ్రీ కింద మార్చేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి స్టేడియం పేరును తారకరామా స్పోర్ట్స్ పెవిలియన్ గా మార్చేశారు. తణుకులో జ్యోతిరావుపూలే కమ్యూనిటి భవన్ పేరును ఎన్టీయార్ భవన్ గా మార్చేశారు. ఇంకా చాలావాటికి తమిష్టం వచ్చిన పేర్లను చంద్రబాబు మార్చేశారు. అప్పట్లో ఉన్నపేర్లను మార్చకూడదని చంద్రబాబు అండ్ కోకి తెలియదా ? ఎన్టీయార్ పేరు మార్చగానే ఇంత గోల చేస్తున్నారు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: